Ivanka on empowering of women at GES ముత్యాల నగరానికి యువతే గొప్ప సంపద: ఇవాంక

Ivanka trump visit pushes women first prosperity for all in india

GES Summit, GES Summit 2017, global entrepreneurship summit, Global Entrepreneurship Summit 2017, Hyderabad, Ivanka Trump, Ivanka Trump in India, Narendra Modi, Prosperity for All, Women First, GES Summit 2017, Ivanka Trump, Narendra Modi, KCR, Hyderabad, Telangana

The United States president’s advisor said India should close the gender gap in its labour force to help its economy grow

ముత్యాల నగరానికి యువతే గొప్ప సంపద: ఇవాంక

Posted: 11/28/2017 06:46 PM IST
Ivanka trump visit pushes women first prosperity for all in india

అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ అన్నారు. కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యువతకు తాను మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నాని తెలిపారు. ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని కొనియాడారు. హైటెక్స్ లోని హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు. ప్రారంభించన అనంతరం అమె ప్రసంగిస్తూ.. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్స్‌ దాకా వెళ్లిందన్నారు.

కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని అలాంటి.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు కాంక్ష వదలకుండా నిరంతరం పని చేయాలి అమె సూచించారు. భారత్ అమెరికాకు నిజమైన మిత్రుడని అధ్యక్షుడు ట్రంప్ చెబుతుంటారని.. అందమైన భారత దేశానికి వచ్చే అవకాశం తమకు దక్కిందని అమె అన్నారు. భాగ్యనగరానికి ముత్యాల నగరంగా కూడా పేరుందని అయితే ప్రస్తుతం ఈ నగర యువతే గొప్ప సంపదని అమె కొనియాడారు.

ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌ తయారైందని ప్రశంసించిన అమె.. ఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తాను తెలుసుకున్నానన్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10శాతం పెరిగిందని చెప్పారు. ఇప్పుడు అమెరికాలో కోటీ 10 లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని అన్నారు.

ఒక్క మహిళ నిలబడితే కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయని తాను కూడా విశ్విసస్తానని అన్నారు. మా నాన్న అధ్యక్షుడైన తర్వాత వ్యాపారాలను వదిలి సహాయ సహకారాలు అందించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకోచ్చారు. గత దశాబ్దంలో నూతన ఉత్పత్తుల రూపకల్పనలో మహిళలు ఎంతో ముందడుగు వేశారన్నారు. ఎంతో మంది మహిళలు ఉత్పాదక రంగంలోకి దూసుకొస్తున్నారని అన్నారు. గత దశాబ్దంలో మహిళా పారిశ్రామికవేత్తలు 90లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇది అభినందించాల్సిన విషయమని అన్నారు. ఈ సందర్భంగా అమె ప్రధాని నరేంద్రమోడీపై కూడా ప్రశంసలు కురిపించారు.

భారత్, అమెరికా దృఢమైన సంబంధాలకు హైదరాబాద్ ప్రతీక అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. హెచ్ఐసిసిలో నిర్వహించిన గ్లోబల్‌ ఎంట్రపెన్యూర్‌ సదస్సులో మాట్లడిన మోడీ… దక్షిణాసియాలో ఈ సదస్సు జరగడం ఇదే మొదటి సారని అది తమ దేశంలోని హైదరాబాద్ లో అమెరికా భాగస్వామ్యంతో నిర్వహించడం గర్వంగా వుందని అన్నారు. ఎంట్రపెన్యూర్స్, ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

మహిళలకే తొలి ప్రాధాన్యత అన్నది భారత చరిత్ర.. సంస్కృతిలో భాగమన్నారు. భారత పురాణాల్లో మహిళలు శక్తికి ప్రతీకలన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి వీరనారీమణులు మనకు ఆదర్శమన్నారు. నేటి భారత మహిళా యువతరం కూడా క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తున్నారని అన్నారు. మరీ ముఖ్యంగా పివీ సింధూ, సైనా నెహ్వాల్, సానియా మిర్జాలు హైదరాబాద్ నుంచే దేశం తరపున ప్రతినిథ్యం వహించి ఎన్నో విజయాలను అందించారని కోనియాడారు.

ఆయుర్వేదం, యోగా భారత్ ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలన్నారు. డిజిటల్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ లో కొత్త అవకాశాలన్నారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ భారత మహిళా మేధోశక్తికి నిదర్శనమన్నారు. వ్యవసాయ రంగంలో 50శాతం భాగస్వామ్యం మహిళలదేనన్నారు. ఇక తమ ప్రభుత్వం కూడా మహిళలకు ముద్ర బ్యాంకు ద్వారా అనేక రుణాలను అందించామని చెప్పారు. మహిళా సాధికరారతకు, స్వాలంభనకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GES Summit 2017  Ivanka Trump  Narendra Modi  KCR  Hyderabad  Telangana  

Other Articles