Upasna's Selfie With Ivanka ఇవాంకతో ఉపాసన సెల్ఫీ..

Upasnam brahmani manchu lakshmi at ivanka ges summit

Ivanka Trump, Upasna, Upasana Ivanka Selfie, apollo hospitals, manchu lakshmi, producer, actress, nara brahmani, heritage, women enterprenuers, telugu states

Upasna also got an invite to the dinner hosted by PM Narendra Modi at Falaknuma Palace and took part in the same. After finishing their dinner, Upasna and her entourage got surprised when Ivanka Trump posed with them for selfies.

ఇవాంక సదస్సులో ‘తెలుగు మహిళ త్రయం’ హల్ చల్

Posted: 11/29/2017 11:27 AM IST
Upasnam brahmani manchu lakshmi at ivanka ges summit

అసియాఖండంలోనే తొలిసారిగా హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాతమకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు(జీఈఎస్‌)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా హల్ చల్ చేశారు. ఇప్పటికే ఓ వైపు సెలబ్రిటీ స్టేటస్ సాధించిన ఈ తెలుగు మహిళా పారిశ్రామిక వేత్తల త్రయం.. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలలో కేవలం 1500 మందికి మాత్రమే అనుమతి వున్న సదస్సుకు అహ్వానం అందుకోవడం విశేషం.

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడులు, సినీనటుడు బాలకృష్ణ కూతురిగా, మంత్రి నారాలోకేష్ భర్యగా తన పనులు చక్కదిద్దుకుంటూనే.. ఇటు హెరిటేజ్‌ పుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. దీంతో పాటు అటు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గోంటూ అమె తనదైన శైలిలో రాణిస్తున్నారు. దీంతో యువ మహిళా పారిశ్రామిక వేత్తగా అమెకు దూసుకెళ్తున్నారు.

మహిళా సాధికారిత ప్రధాన అంశంగా ఈ సదస్సు జరగడం హర్షణీయమని బ్రహ్మణి అన్నారు. అందుకు హైదరాబాద్‌ అతిథ్యమివ్వడం అనందంగా ఉందని చెప్పారు. దేశంలో పారిశ్రామిక వేత్తలుగా మహిళలు శిఖరాగ్ర స్థానంలో కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నారని, అదే అమెరికా లాంటి దేశాల్లో 20 శాతం దాకా ఉన్నారని అన్నారు. ఇక్కడ మరింత మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారయ్యేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని చెప్పారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణిగా అయనకు సంబంధించిన విషాలను ఎప్పటికప్పుడు సామాజిక మాద్యమాల్లో పెట్టి అభిమానులతో పంచుకునే ఆయన సతీమణిగా మాత్రమే తెలిసిన ఉపాసన.. అపోలో హాస్పిటల్స్‌ వైఎస్‌ ఛైర్మన్‌ అన్న విషయం కూడా తెలియాలి. అదే హోదాలో ఇవాంక సదస్సుకు హాజరయ్యారు. తమ అపోలో గ్రూపు అధ్వర్యంలో చేపట్టే అనేక సామాజిక కార్యక్రమాలకు కూడా అమె నేతృత్వం వహిస్తారు. అ హోదాలోనే ఉపాసన కూడా ఇవాంక సదస్సకు అహ్వానం అందుకున్నారు.

ప్రధాని మోడీ, ఇవాంక ట్రంప్ లు అసీనులైన మొదటి వరుసకు వెనక రెండో వరుసలో అమెకు నిర్వాహకులు సీటును కేటాయించారు. దీనిని టీవీలో లైవ్ షోలో చూసిన రామ్ చరణ్ దానిని స్రీన్ షాట్ తీసి.. అమెకు పంపారు. ఇక ఈ సదస్సుపై ఉపాసన మాట్లాడుతూ జీఈఎస్‌కు హైదరాబాద్‌ ఆతిథ్య మివ్వడం ఆహ్వానించదగిని శుభపరిణామన్నారు. మహిళ సాధికారితకు ఈ సదస్సు ఉపయోగపడు తుందని చెప్పారు. పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రోత్సాహం అవసరమన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు.

ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతరిగా, నటిగా, నిర్మాతగా, సామాజిక కార్యకర్తగా అనేక బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న ముందుకెళ్తున్న మంచు లక్ష్మీ కూడా ఈ సదస్పుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సు ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రముఖ వ్యక్తుల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సు వేదికగా అందరితో కలిసి మాట్లాడటం గొప్ప అవకాశమని చెప్పారు.

ఇక క్రితం రోజు రాత్రి ఫలక్ నుమా ఫ్యాలెస్ లో జరిగిన అతిధ్యానికి హాజరైన అపోలో పౌండేషన్ వైస్ చెర్మన్ ఉపాసనా కొణిదెల అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతరు, సలహాదారు ఇవాంక ట్రంప్ తో కలసి సెల్పీ దిగారు. దానిని వెంటనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ అనుభూతి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ, ఇవాంక, కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 The most empowering experience. Thank u @narendermodi @IvankaTrump @KTRTRS #telangana govt & #india for encouraging women to work.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles