rtc bus narrow escape from falling into gorge తప్పిన పెను ప్రమాదం.. ప్రాణాలు నిలిపిన డ్రైవర్ సాహాసం

Rtc bus narrow escape from falling into gorge

RTC Bus, narrow escape, falling, gorge, mamillakunta cross, puttaparthi, ananthapur, appreciations, passengers, driver, two wheeler, dareness, andhra pradesh

RTC Bus had a narrow escape from falling into gorge at mamillakunta cross of puttaparthi mandal of ananthapur. appreciations throng from passengers for the driver who dared and saved their lives.

ITEMVIDEOS: తప్పిన పెను ప్రమాదం.. ప్రాణాలు నిలిపిన డ్రైవర్ సాహాసం

Posted: 11/28/2017 03:59 PM IST
Rtc bus narrow escape from falling into gorge

డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పెద్ద సాహసానికే ఒడిగట్టడంతో.. అంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు రోడ్డు పక్కనున్న బాయిలోకి పడబోయింది. అయితే డ్రైవర్ చివరి నిమిషంలో బ్రేకులు వేసి అదమి పట్టడంతో ప్రయాణికులు ప్రాణాలను అరతచేతిలో పెట్టుకుని అరగంట సేపు దేవుడా రక్షించు అంటూ ఎన్నడూ వేడుకోని చేతులు కూడా నేడు అర్థించాయి.

అనంతపురం జిల్లా గోరంట్ల-పుట్టపర్తి మార్గంలో వస్తున్న ద్విచక్ర వానహదారుడు..  ధర్మవరం వెళ్తున్న అర్టీసీ బస్సుకు ఎదురుగా వచ్చి ఢీకొనబోయాడు. దీంతో బస్సు డ్రైవర్‌ ఇక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొని సమీపంలోని బావి వద్దకు దూసుకెళ్లింది. బస్సు 30 అడుగుల లోతున్న బావిలోకి ఒరిగినప్పటికీ డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బ్రేకులు గట్టిగా వేసి ఆపగలిగాడు.

ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అరగంట వరకు అలాగే బస్సును నియంత్రించిన తర్వాత పోలీసులు, స్థానికులు ప్రయాణికులను నెమ్మదిగా కిందకి దించారు. ఈ ప్రమాదంలో ఓ పాదచారుడు అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తన చాకచక్యంతో 50 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్‌ను అందరూ మెచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC Bus  narrow escape  falling  gorge  mamillakunta cross  puttaparthi  ananthapur  

Other Articles