Cop Suspended For Hitting Moving Biker ఖాకీకావరానికి పరాకాష్ట.. విస్తుగోలిపే భక్షకభటుని చేష్ట

Tamil nadu cop suspended for hitting moving biker with stick

Policeman Hits Biker, Rajesh, Road safety, Helmets, Thirivatturu, kanya kumari, SP Durai, maria ackrose, Tamil Nadu, crime

A police officer in Tamil Nadu's Kanyakumari district has been suspended for hitting a moving biker on the head with a stick and injuring him.

ITEMVIDEOS: ఖాకీకావరానికి పరాకాష్ట.. విస్తుగోలిపే భక్షకభటుని చేష్ట

Posted: 11/25/2017 05:43 PM IST
Tamil nadu cop suspended for hitting moving biker with stick

తమిళనాడులో ఓ ఏఎస్సై రౌడీయిజం ప్రదర్శించాడు. హెల్మెట్ పెట్టుకోని వాహనదారులపై లాఠీ ఝుళిపించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించిన ఉన్నతాధికారులు.. వాహనదారుల ప్రాణాలను హరిస్తున్న భక్షకభటుడి చేష్టలకు నివ్వెరపోయి సస్పెండ్ చేశారు. హెల్మెట్ పెట్టుకోని వాహనదారులపై అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఈ తమిళనాడు పోలీస్. హెల్మెట్లు ధరించని వారిని తమిళనాడు పోలీసులు ఏం చేస్తున్నారో చూస్తే దిమ్మ దిరిగిపోతుంది.
 
తమిళనాడులో ఖాకీ కౌర్యానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..  ఓ రోడ్డుపై పోలీసులు అటు ఇటు నిల్చుని వున్నారు. ఎందుకిలా నిల్చున్నారంటే.. వాహనదారుల కోసం. హెల్మెట్ ధరించిన వాహనదారులను అపి వారికి ఫైన్ వేస్తున్నారు. అయితే ఇంతలో కొందరు వాహనదారులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని వెగంగా వెళ్లారు. దీంతో చిర్రెత్తుకోచ్చిన ఎస్ఐ మారియా అక్రోస్.. వాహనదారులకు బుద్ది చెప్పాలనుకుని ఇలాంటి చర్యకు తెరలేపాడు. ఏం చేశాడంటే..

కన్యాకుమారిలోని తిరువట్టూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న మారియా అక్రోస్ హెల్మెట్ పెట్టుకోని వారిపై దారి కాచి మరీ దాడికి పాల్పడుతున్నారు. అలా ఇలా కాదు వారి తలనే టార్గెట్ చేస్తున్నాడు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసే భక్షించేస్తున్నాడని, స్థానికుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. అ తరువాత ఇందుకు సంబంధించిన వీడియో సిసీటీవీ ఫూటేజీలో లభ్యం కావడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles