Ivanka, Chelsea come to Malia's defense మాలియా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించవద్దు

Ivanka trump and chelsea clinton come to malia obama s defense

malia obama smoking, malia obama boy friend, malia obama smoke rings, malia obama university, malia obama media, ivanka trump, malia obama, harvard, barack obama, Chelsea Clinton, president. US first daughter, America

Ivanka Trump came to the defense of former first daughter Malia Obama on Twitter after multiple reports appeared in the news detailing the eldest Obama daughter’s life in college.

మాలియా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించవద్దు

Posted: 11/25/2017 04:48 PM IST
Ivanka trump and chelsea clinton come to malia obama s defense

అమెరికా అధ్య‌క్షుడి కుటుంబం గురించి మీడియాకు నిరంతరం ఆసక్తే. అయితే వీరి విషయంలోనే కాకుండా మాజీ అధ్య‌క్షుల విషయంలో కూడా మీడియా అనేక పర్యాయాలు ఎంటరైంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మీడియా బయటపెట్టిన విషయాలు నానా రచ్చను సృష్టించాయి. మాజీ అధ్యక్షుడి కుటుంబానికి సంబంధించి విషయంలో వేలుపెట్టిన మీడియా.. తీరా తాను పెట్టిన వార్తను కనిపించకుండా చేయడంతో తో పాటు అనేక విమర్శలను ఎదుర్కోంది.

ఇంతకీ ఏం జరిగిందీ.. అసలు ఆ మాజీ అధ్యక్షుడు ఎవరూ..? అంత రచ్చ చేసిన విషయం ఏంటీ అనేగా మీ డౌట్స్.. వివరాల్లోకి వెళ్తే.. మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా పెద్ద కూతురు మ‌లియాను ఉన్నత చదువుల కోసం అమె తండ్రే స్వయంగా అమెను యూనివర్సిటీలో దింపివెళ్లారు. అప్పుడాయన కళ్లలో నీళ్లు గుండ్రగా తీరిగాయన్న విషయాన్ని కూడా చెప్పారు. అయితే అందుకు సంబంధించి కొన్ని తాజా వార్త‌ల‌ను అక్క‌డి మీడియా ప్ర‌సారం చేసింది.

మలియా ఒబామా పొగ తాగుతున్న‌ట్లు, గుప్పు గుప్పున పోగను రింగిలు రింగిలుగా గాల్లోకి వదులుతున్నట్లు కథనాన్ని ప్రచురించిన మీడియా అంతటితో అగకుండా అమె తన భాయ్ ఫ్రెండ్ ముద్దాడుతున్న‌ట్లు ఉన్న ఫొటోల‌ను అగ్రరాజ్య మీడియా ప్ర‌సారం చేసింది. ఈ ఫోటోలు, కథనాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి రచ్చ రచ్చ చేశాయి. దీనిపై పై ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ కుమార్తె చెల్సియాలు మాలియాకు అండగా నిలిచారు.

అమెరికన్ మీడియాపై వీరిద్దరూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ట్విట్ల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. వారేం అన్నారంటే.. 'మలియా ఒబామా ఇప్పుడు ఒక సాధార‌ణ వ్య‌క్తి. వ్య‌క్తిగత గోప్య‌త ఆమె హ‌క్కు. మీడియా త‌న హ‌ద్దుల్లో ఉండాలి' అని ఇవాంకా ట్వీట్ చేయ‌గా,  'ఒక యువతిగా, విద్యార్థినిగా, సాధార‌ణ వ్య‌క్తిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాదు. మీడియా కాస్త ఉన్నతంగా ప్ర‌వ‌ర్తించండి' అని చెల్సియా క్లింటన్‌ ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles