Brownie Points for RaGa నిండు సభలో అమెను రాహుల్ కౌగలించుకున్నాడు..

Viral twitterati singing praises for rahul gandhi

Rahul Gandhi, Congress vice-president, Gujarat elections, parttime lecturer, sanskrit lecturer, Emotional, vijay rupani, rahul gandhi national flag, rahul gandhi indias flag, rohit vemula, dalits, latest news

Rahul Gandhi who was moved by the tears of Dr Ranjanaben Awasthi, a PhD in Sanskrit, walked down the stage to console her, and gave her a hug. The photos of the interaction have gone viral overnight.

ITEMVIDEOS: రాహుల్ ఇలా చేస్తారని ఎవరైనా ఊహించగలరా..?

Posted: 11/25/2017 06:49 PM IST
Viral twitterati singing praises for rahul gandhi

పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ పెద్దావిడ గోడు విని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చలించిపోయారు. ఆమెను రాహుల్ అక్కునచేర్చుకుని ఓదార్చడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండ్రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు రాహుల్ శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి స్కూల్ టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు సహా అనేకమంది అధ్యాపకులు వచ్చారు.

ప్రశ్నోత్తరాల సందర్భంగా రంజనా అవస్తి అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ..‘‘1994లో నేను సంస్కృతంలో పీహెచ్‌డీ పూర్తిచేశాను. అప్పటి నుంచి మేము దుర్భర పరిస్థితుల్లోనే కొనసాగుతున్నాం. పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా ఉద్యోగం మొదలుపెట్టి 22 యేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ మా జీతం నెలకు 12 వేలుగానే ఉంది.. కనీసం మాకు మెటర్నిటీ సెలవులు కూడా ఇవ్వడం లేదు. గుజరాత్‌లో నాలాంటి అనేకమంది లెక్చరర్లు కనీసం హక్కులకు కూడా నోచుకోవడంలేదు...’’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

తీరా ఇప్పుడు సర్వీసు మొత్తానికి గానూ రూ.40 వేలు ముట్టజెప్పి గుజరాత్ ప్రభుత్వం తమ ఉద్యోగాలను రద్దుచేయాలకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగుల్లాగనే తమకు కూడా పెన్షన్ కల్పిస్తే సమాజంలో గౌరవంగా బ్రతకగలమని రాహుల్ దృష్టికి తెచ్చారు.  అవస్తి చెప్పిన విషయాలు విని చలించిపోయిన రాహుల్... కాసేపు వేదికపై మౌనంగా ఉండిపోయారు.

‘‘కొన్నిసార్లు.. కొన్ని ప్రశ్నలకు మాటలతో సమాధానం చెప్పలేం..’’ అంటూ వేదిక మీద నుంచి దిగి ఆమె వద్దకు వచ్చారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని సదరు అధ్యాపకురాలిని ఓదార్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్ట్‌టైమ్ లెక్చరర్లకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని అప్పటికప్పుడు హామీ ఇచ్చారు. ఆయన స్పందించిన తీరుతో అక్కడికి వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles