bjp mp nityanand rai draws controversy బీజేపి ఎంపీ నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు

Fingers raised at narendra modi will be chopped off says nityanand

Bharat Mata Ki Jai, Bharatiya Janata Party, Bihar state chief, BJP, Modi, Narendra Modi, Nityanand Rai, Pakistan, Patna, Prime Minister, Ujiarpur, Vanshi Chacha Samajik Vikas Parishad

Bihar unit chief Nityanand Rai stoked a controversy on Monday, when he asked party supporters to chop off the fingers and hands of people who voice criticism against Prime Minister Narendra Modi.

కాంట్రవర్సీ రాజేసిన నిత్యానంద

Posted: 11/21/2017 05:28 PM IST
Fingers raised at narendra modi will be chopped off says nityanand

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ప్రేమను కనబర్చుకునే క్రమంలో సామాన్యులు హద్దులు మిరితే అర్థం చేసుకోవచ్చు.. కానీ పార్టీకి చెందిన ఎంపీలే.. పరిధులు ధాటడంతో పాటు.. వారు చెప్పిన మాటలను కూడా అలకించకుండా పెడచెవిన పెట్టి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఏడాది నోట్ల రద్దు సమయానికి ముందు విపరీతంగా చోటుచేసుకున్న ఈ తరహా ఘటనలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

కయ్యానికి కాలుదువ్వేలా.. అధికార దర్పంతో మాట్లాడుతున్న మాటల మాదిరిగా వున్న పార్టీ నేతల వ్యాఖ్యలు సామాన్యులను అందోళనలోకి నెడుతున్నాయి. తాజాగా బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు, ఉజియర్ పూర్ ఎంపీ నిత్యానంద రాయ్ ఇలాంటి వ్యాక్యలే చేసి కాంట్రవర్సీ రాజేశారు. బెంగుళూరులో జరిగిన పార్టీ సమావేశంలో నోరుజారితే వేటు పడుతుందని పార్టీ నేతలకు అమిత్ షా గట్టి హెచ్చరికలు చేసినా.. పార్టీకి చెందిన ఎంపీలే పెడచెవిన పెడుతున్నారు.

నరేంద్ర మోడీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని నిత్యానంద వ్యాఖ్యానించి దుమారం రేపారు. ‘మీ సొంత కుమారుడు పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారు. మనుషుల మధ్య అభిప్రాయబేధాలు సహజం. దేశంలో వాటికి విలువ ఇవ్వాల్సిందే. ఆయనకు(మోదీ)కి వ్యతిరేకంగా ఎవరైనా చేయి లేదా వేలెత్తి చూపితే వాటిని విరగొట్టేందుకు మేమంతా ఒక్కటవుతాం. నరకడానికి కూడా వెనుకాడబోమ’ని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయ్యింది.

నిత్యానంద వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యానంద వ్యాఖ్యలను జేడీ(యూ) నాయకుడు అజయ్ అలోక్‌ సమర్థించారు. ఆయన మాటల్లోని భావోద్వేగాలు చూడాలని, ఆయన వాడిన మాటలు కాదని అన్నారు. నరేంద్ర మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని నిత్యానంద పేర్కొనడం గమనార్హం. కాగా, మూడున్నరేళ్ల క్రితం దేశమంతా నమో మంత్రం జపించినప్పుడు లేని అందోళన, భావోద్వేగం.. ఇప్పుడు విమర్శించే సమయానికి ఎందుకు వర్తిస్తుందని, అంటే బీజేపి నేతలే మోడీ మానియా తగ్గిపోయిందని అంగీకరిస్తున్నారా..? అంటూ విపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nityanand Rai  Sushil Kumar Modi  shakti singh yadav  Narendra Modi  Bihar politics  Bihar BJP  

Other Articles