good news to diabitic patients షుగర్ పేషంట్లకు శుభవార్త.. కొత్త వరి వంగడం

Good news to diabitic patients now can consume rice

indian institute of rice research, center for cellular molecular biology, samba masuri ism, new paddy seed, new variety paddy seed, glysimic index, telangana, andhra pradesh, chattisgarh, bihar, uttarpradesh, large quantity of rice production, early production, Dr. Rakesh Kumar, ISM samba masuri vareity, latest news

good news to diabitic patients, now can consume rice as indian institute of rice research and center for cellular molecular biology jointly developed a new variety of paddy samba masuri ism.

షుగర్ పేషంట్లకు శుభవార్త.. కొత్త వరి వంగడం

Posted: 11/22/2017 08:55 AM IST
Good news to diabitic patients now can consume rice

షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు రైస్ తీసుకోవాలంటే వంట్లో షుగర్ లెవల్స్ ఎక్కడ పెరుగుతాయోనని అయిష్టంగానే జోన్న, గొధుమ రెట్టలను అరగిస్తూ, అర్థాకలితో అలమటిస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. ఇక మీరు కూడా కడుపు నిండా అన్నం అరగించవచ్చు. శాస్త్రవేతల్లు ఈ మేరకు పరిశోధన చేసి కొత్తగా సృష్టించిన వరి వంగడంతో ఉత్పత్తి అయిన బియ్యం ఎంత తిన్నా షుగర్ లెవల్స్ పెరుగుతాయన్న అందోళన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు.

అన్నాన్ని ప్రాథమిక అహారంగా తీసుకునే దక్షిణాధి ప్రజలు.. షుగర్ వ్యాధి బారిన పడి అర్థాకలితో వుంటున్నారన్న విషయాన్ని గ్రహించి వారి కోసం కొ్త్త రకం వరి వంగడాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగపడే ఇంప్రూవ్డ్ సాంబమసూరి ఐఎస్ఎం వరి వంగడాన్ని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్( ఐఐఆర్ఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా.

సాధారణ సాంబమసూరి రకంలో గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) 52.9 నుంచి 69 శాతం దాకా ఉంటుంది. ఈ కొత్త వంగడంలో అది కేవలం 50.99 శాతం మాత్రమే ఉంటుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లో 1.30 లక్షల హెక్టార్లలో ఐఎస్ఎం వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగుచేయగా.. ఎకరాకు 35 నుంచి 37 బస్తాల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. ఈ వంగడం రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని స్పష్టంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new rice varity  diabitic patients  sugar free rice  samba masuri ISM  IIRR  CCMB  Rakesh Kumar  

Other Articles