rich women turned beggers in movie style ఈ కోటీశ్వరులు ‘బిచ్చగాడు’ బెగ్గర్స్

Rich women turned beggers in hyderabad in movie style

rich beggars in hyderabad, ivanka trump, donald trump. american president advisor, US president daughter, Global Entrepreneurship Summit, PM Modi, KCR, Rich beggers in hyderabad, beggars in hyderabad, Telangana, Hyderabad, beggar free city, latest

rich women turned beggers in hyderabad, who claimed that they are devotees of durgea and for sake of mental peace they are begging

‘బిచ్చగాడు’ సినిమాను తలపిస్తున్న రిచ్ బెగర్స్..

Posted: 11/21/2017 04:12 PM IST
Rich women turned beggers in hyderabad in movie style

అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఎక్కడ యాచకుటు కనపించినా వారిని జైళ్లకు తరలించేస్తున్నారు. ఇలా యాచకులుగా మారిన వారి బంధువులను రప్పించి.. వారికి అప్పగిస్తున్నారు. ఇలా ఎవరు రాని యాచకులు మాత్రం ఇవాంక పర్యటన ముగిసేంత వరకు జైళ్లలోనే వుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బెగ్గర్‌ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు.

అచ్చంగా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిచ్చగాడు చిత్రం తరహాలో ఓ ఇద్దరు మహిళలు యాచకవృత్తిని ఎంచుకున్నారు. మెహదీపట్టణంలోని ఓ దర్గా వద్ద బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు నవంబర్‌ 11న చర్లపల్లి ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈ బిచ్చగాళ్లలో చక్కని ఇంగ్లీష్‌ మాట్లాడుతున్న ఇద్దరి మహిళలను చూసి జైలు అధికారులు అవాక్కయ్యారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కోట్లకు కోట్ల ఆస్తి ఉండి.. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలని తెలుసుకోని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వివరాలు.. ఫర్జానా, రబియా బసీరా అనే మహిళలు గత కొద్దిరోజులుగా లంగర్‌ హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నారు.

హైదరాబాద్‌ ఆనంద్ బాగ్ కు చెందిన ఫర్జానా(50) ఏంబీఏ చదివింది. లండన్ లో అకౌంట్స్ ఆధికారిగా కూడా పనిచేసింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అయిన కుమారుడి దగ్గర ఉండేది.  అనారోగ్యానికి గురైన ఫర్జానా. ఓ బాబాను సంప్రదించింది. వ్యాధి తగ్గాలంటే దేవుడి దయ ఉండాలని, దర్గా వద్ద భిక్షాటన చేయాలని సూచించడంతో మరోమార్గం లేక యాచక వృత్తిని ఎంచుకుంది. తల్లిని వదిలించుకోవాలనే ఫర్జానా కొడుకు పన్నిన పథకమిదన్న అరోపణలు వున్నాయి.

రబియా బసీరాకు అమెరికా గ్రీన్ కార్డ్‌ కూడా ఉంది. గతంలో అమెరికాలో ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసింది. నగరంలో కోట్లకు కోట్ల ఆస్తి ఉంది. బంధువులతో కలిసి ఉండాలని హైదరాబాదులోనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోయాడు. తనకు అండగా ఉన్న కూతురు కూడా కన్ను మూసింది. కోడుకులు, బంధువులు మోసం చేసి ఆస్తి లాక్కొని ఒంటరిదాన్ని చేశారని దీంతో అమె దర్గా వద్ద బిక్షాటన చేస్తుందని తెలిసింది. అయితే రబియా మాత్రం తనకు మనశ్శాంతి కావాలని.. దానిని కోరుకునేందుకే తాను యాచిస్తున్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ivanka trump  donald trump  Global Entrepreneurship Summit  beggars  PM Modi  KCR  Telangana  Hyderabad  

Other Articles