bithiri sathi alias ravi resigns to v6 channel వీ6 ఛానెల్ కు బిత్తిరి సత్తి గుడ్ బై..

Bithiri sathi alias ravi resigns to v6 channel

bithiri sathi, v6, teenmaar, teenmaar sathi, v6 bithiri sathi, resignation, top channel, movie chances, events, programmes, tv, entertainment

bithiri sathi a popular artist and anchor with unique slang of telengana who gained popularity with teenmaar programme has resigned to v6 channel

వీ6 ఛానెల్ కు బిత్తిరి సత్తి గుడ్ బై..

Posted: 11/09/2017 10:03 AM IST
Bithiri sathi alias ravi resigns to v6 channel

తెలంగాణ బాషలో తనదైన యాసలో మాట్లాడుతూ.. యాంకరింగ్ కార్యక్రమాలలో తనదైన కొత్త ఒరవడిని సృష్టించి దూసుకెళ్లిన బిత్తరి సత్తి అలియాస్ రవి, మనందరికీ సుపరిచితుడే. అతని పాపులారిటీ ఎలాంటిదంటే చెప్పడానికే కష్టంగా వుంటుంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఏకంగా బిత్తరి సత్తి సెలబ్రిటీ స్టేటస్ సాధించాడంటే అది అతిశయోక్తి కాదు. తాజాగా సత్తి సినిమాలు, ఈవెంట్లు ఇలా అనేకానేకం చేసుకూంటు ముందుకు దూసుకుపోతున్నాడు.

బిత్తిరి సత్తి ఇంతలా తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్పులు గెలుచుకోవడానికి కారణం మాత్రం వీ6 ఛానెల్ దే. తన నటనను నిరూపించుకునేందుకు ఆయనకు అవకాశమిచ్చి.. వెన్ను తట్టి ప్రోత్సహించిన వీ6 ఛానెల్ కే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఆయన కోసం ప్రత్యేకంగా 'తీన్ మార్' కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చి మరింత పాపులారిటీ అర్జించేందుకు దోహదపడింది. అయితే తాజగా తాను మొదటి నుంచి పని చేస్తున్న 'వీ6' చానల్ కు సత్తి రాజీనామా చేసినట్టు సమాచారం.

చానల్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు, సత్తికి పాప్యులారిటీ పెరుగడంతో ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ఆఫర్లు వచ్చాయి. దీంతో అతడ్ని ఇబ్బందిపెట్టడం, అవకాశాలను చేజార్చుకునేలా చేయడం ఇష్టంలేని యాజమాన్యం అందుకు కూడా అనుమతిని ఇచ్చింది. సత్తి ప్రైవేటు షూటింగ్ లకు కూడా సంస్థ కెమెరాలను తీసుకువెళుతున్నా పెద్దగా లక్ష్యపెట్టకుండా చూసిచూడనట్లుగానే వ్యవహరించింది. ఇటీవలి కాలంలో ఈవెంట్లతో పాటు సినిమా చాన్సులు కూడా పెరగడం, ఉదయభాను వంటి టాప్ యాంకర్ తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో సత్తి వీ6తో తెగతెంపులు చేసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది.

తాను ఎన్ని రకలుగా తన వీ6 యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినా.. యాజమాన్యం అతడ్ని వెనుకేసుకు వస్తుండటంతో.. సత్తి మరో కోణంలో వ్యవహరించి వీ6 నుచంి బయటకు వచ్చేందుకు ప్రణాళిక రచించుకున్నాడని సమాచారం. తన ప్రణాళిక మేరకు వీ6 తీన్మార్ టీమ్ ను ఎంతమాత్రమూ కేర్ చేయడం లేదని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని మేనేజ్ మెంట్ ప్రస్తావించగా, గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడని సమాచారం. రూ. 2 లక్షల నెల వేతనంతో మరో ప్రముఖ చానల్ లో సత్తికి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles