Kodela Request YSRCP MLAs to Attend Assembly Sessions | వైసీపీకి గమనిక : ఆనాడు ఎన్టీఆర్ ఒక్కడే రాలేదు.. మిగతా వారంతా వచ్చారంట!

Kodela reactions on ysrcp mlas complaint

Andhra Pradesh, Speaker Kodela Siva Prasad, YSR Congress Party, Kodela YSRCP MLAs, Assembly Winter Sessions, Andhra Pradesh Assembly,

Andhra Pradesh Assembly Speaker Kodela Siva Prasad Requests YCP Members To AP Assembly Winter Sessions. He Remind them only NTR not attend session at Once Upon a Time.

ఫిరాయింపులపై కోడెల సప్పటి మాటలు

Posted: 11/09/2017 10:04 AM IST
Kodela reactions on ysrcp mlas complaint

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరి పదవులనుభవిస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలంతా కోడెలను కలిసి కోరారు. దీనిపై కోడెల స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తనను కోరారని... అయితే, దీనికోసం తాను ఓ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

తాను నిర్ణయం తీసుకోక ముందే వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారని, అక్కడ పిటిషన్ ను కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని... సుప్రీంకోర్టు దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిందని చెప్పారు. అక్కడ తీర్పు వెలువడాల్సి ఉందని... కేసు సుప్రీంకోర్టులో ఉంటే తాను నిర్ణయం ఎలా తీసుకోగలనని? ప్రశ్నించారు. ఫిరాయింపు కారణాన్ని చూపుతూ, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని వైసీపీ నేతలు చెప్పడం బాధాకరమని కోడెల అన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని వారు అంటున్నారని... అయితే, ఎన్టీఆర్ తానొక్కరే అసెంబ్లీని బహిష్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారని... చివరి రోజు వరకు సభలో తమ వాదనను వినిపించారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు తాను ఫోన్ చేశానని కోడెల చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles