AP 10th and inter exam time table ఇంటర్, 10వ తరగతి విద్యార్ధులూ.. ఇదిగో మీ ఎగ్జామ్ షెడ్యూల్

Andhra pradesh class 10th and inter exam time table released

intermediate time table 2018, ap intermediate time table 2018, bieap, ap intermediate 2018 exam, Inter 1st year exam time table 2018, inter 2nd year exam time table 2018, ssc exam time table 2018, AP 1oth class 2018 exam timetable, exam time table

class 10th exam schedule has been released by the Board of Secondary Education and The time table of AP Inter 1st year 2nd year March 2018 has been released on the board’s official website www.bieap.gov.in.

ఇంటర్, 10వ తరగతి విద్యార్ధులూ.. ఇదిగో మీ ఎగ్జామ్ షెడ్యూల్

Posted: 11/09/2017 10:41 AM IST
Andhra pradesh class 10th and inter exam time table released

పదవ తరగతి, ఇంటర్ పస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇక తమ అటపాటపై వున్న దృష్టిని మరల్చి చదుపుపై అధికంగా ఫోకస్ చేయాల్సిన సమయం అసన్నమైంది. ఎందకంటే ఇక పరీక్షల కాలానికి సమయం అసన్నమైందని ఆయా విభాగాల అధికారులు పరోక్షంగా తెలియజేశారు. ఇప్పటికే ఇంటర్ పస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ టైమ్ టేబుల్ ను తమ వెబ్ సైట్లో పోందుపర్చిన అధికారులు ఇవాళ తాజాగా పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేశారు.

మార్చి 15 నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 29 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 36 వేల 831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరకానున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2800 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా పరీక్షల ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పిన అధికారులు.. రాష్ట్రంలోని విద్యార్ధులందరూ బల్లలపై కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.

ఇక మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను కూడా క్రితం రోజున ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 31న పర్యావరణం, జనవరి 29న ఎథిక్స్.. హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి. ఇక పూర్తి టైం టేబుల్ కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ www.bieap.gov.in.లోకి లాగిన్ అవ్యండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  10 th class  intermiediate  inter 1 year  inter 1 year  exam time table  exam shedule  

Other Articles