Aadhaar linking with govt schemes extended ఆధార్ లింక్: సరళీకృత విధానాలకు సై.. పొడిగింపు..

Aadhaar card linking with schemes deadline extended by centre

Aadhaar card linking, Supreme Court, Unique Identification Authority of India number, PAN card, Bank Accounts, SIM cards, Aadhaar Act, government schemes, PM Modi, Aadhaar, UIDAI

The government is considering the option of allowing other identity proofs to complete the verification process. These IDs could include ration card, driver's license and passport.

ఆధార్ లింక్: సరళీకృత విధానాలకు సై.. పొడిగింపు..

Posted: 10/26/2017 04:03 PM IST
Aadhaar card linking with schemes deadline extended by centre

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానం చేయడానికి చివరి గడువును ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఇక అనుసంధానం చేయడానికి సమ్మతించే వారికోసం ఈ గడువును మరికొన్ని నెలల పాటు పెంచుతున్నట్లు కేంద్ర దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ డిసెంబరు 21వ తేదీతో ముగియనున్న గడువును రానున్న మార్చి 31 వరకు పెంచుతున్నట్లు.. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. దేశఅత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపారు.

ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు ఖాతాలకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించిన సమయంలో కేంద్రం ఈ మేరకు తెలిపింది. ఇదే క్రమంలో బ్యాంకు అకౌంట్లకు, మొబైల్‌ నెంబర్లకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారిపై తీసుకుంటారన్న విషయాన్ని వచ్చే సోమవారంలోగా తెలపాలని అదేశించింది.

సిమ్ కార్డులను ఆధార్ తో లింక్ చేసే ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. వినియోగదారుల ఇంటి దగ్గరకు వెళ్లి ఆధార్ ధ్రువీకరణ తీసుకోవడం, వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత పరిశీలన ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. టెలికాం కంపెనీల సిమ్ కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారుల్లో వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉండే అవకాశం ఉండటంతో.. వినియోగదారుల ఇంటి దగ్గరకే వెళ్లి అనుసంధానం ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం కంపెనీలకు సూచించింది.

దీంతోపాటు ప్రజల విజ్ఞప్తి మేరకు ఆన్ లైన్ విధానాన్ని కూడా రూపొందించాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. మొబైల్ యూజర్ల ఆధార్ వెరిఫికేషన్ కోసం ఆధార్ ఓటీపీ సేవలను ఎస్ఎంఎస్, ఐవిఆర్ఎస్ లేదా లేదా మొబైల్ యాప్ ద్వారా అందించేలా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరింది. ఆధార్ డేటాబేస్లో ఒక మొబైల్ నంబర్ నమోదై ఉంటే.. ఓటీపీ పద్ధతి ద్వారా అదే మొబైల్ నంబర్ తోపాటు వినియోగదారునికి ఉన్న ఇతర నంబర్లను కూడా ధ్రువీకరించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles