Man Scared by 'Shark' in Washington Museum సోరచేప ఒక్కసారిగా మీదకు దూసుకువస్తే..

Man s terror as white shark lunges at him through glass tank

shark aquarium,Gregory Heinzman,shark charges at man,shark video,Casey peck,International spy museum,Shark attack,funny video,funny shark video,funny reaction to shark

A Man was given the fright of his life after believing he was about to be savaged by a giant shark through an aquarium window.

ITEMVIDEOS: సోరచేప ఒక్కసారిగా మీదకు దూసుకువస్తే..

Posted: 10/26/2017 02:57 PM IST
Man s terror as white shark lunges at him through glass tank

పెంపుడు జీవాల జాబితాలో ఇప్పుడు చేపలు కూడా చేరిపోయాయి. చాలా మంది తమ ఇళ్లలో, కార్యాలయాల్లో చేపలను అక్వేరియంలలో పెంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తమకు శుభం జరుగుతుందని కూడా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల చేపలను అక్వేరియంలలో పెంచుకుంటే అయుష్షు, అరోగ్యం, ధనలాభం కూడా కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. వారి నమ్మకాలు వారివి.

అయితే.. కొందరు మాత్రం ఇళ్లలో కాకుండా తమ కార్యాలయాలు, రెస్టారెంట్లలో షాపింగ్ మాల్స్ లలో అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని చూడటానికి వచ్చే ప్రజలు తమ దుకాణాలలో వ్యాపారం చేస్తారని కూడా వారు నమ్ముతున్నారు. ఇల్లలో మాదిరిగా చిన్నగా కాకుండా ఏకంగా ఫెద్ద పెద్ద అక్వేరియంలను ఏర్పాటు చేయడంతో వాటిని చూసేందుకు వస్తున్న ప్రజలు తెగ ఎంజాయ్‌ చేస్తుండటంతో అది కూడా తమ వ్యాపారాలకు కలసివస్తుందని భావిస్తున్నారు వ్యాపారులు.

youtube}v=mB37QjTSUhk|620|400|1{/youtube}

అమెరికాకు చెందిన గ్రెగరీ హైన్జ్ మ్యాన్ కు కూడా అక్వేరియం అంటే చాలా అమితమైన ఇష్టం. దీంతొ వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ స్పై మ్యూజియంలో సోరచేపలతో అక్వేరియం రూపోందించారని తెలిసి దానిని చూడటానికని అక్కడికి వెళ్లాడు. చేపలతో ఇన్నాళ్లుగా అటలాడించిన తాను.. సోరచేపలను కూడా అలాగే అటపట్టించాలనుకున్నాడు. అక్వేరియం గాజుపై కొడుతూ అందులోని షార్క్‌లను ఆటపట్టించాడు. అలా అతన్ని గమనించి.. గమనించకుండానే సొరచేపలు అలా వెళ్లాయి.

ఇలా చేస్తూ అనందంపోందిన అతనికి ఆ సంతోషం అంతా ఒక్క క్షణంలో అవిరై.. దెబ్బకు భయం పట్టుకుంది. కాదు పట్టుకునేలా చేసింది ఓ సోరచేప. నీళ్లలో ఎక్కడో వున్న ఓ సోరచేప ఒక్క ఉదుటున అతని చేయిని తన నోటు కరుచుకునేందుకు వచ్చింది. సోరచేప వేగానికి గాజు అద్దం కాస్తా బీటాలువారిం పగుళ్లు పడ్డాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామం చూసి నవ్వుకున్నాడు గ్రెగరీ. షార్క్‌ వేగంగా వచ్చి అక్వేరియంను తాకినప్పుడు అది పగిలినట్లు భ్రాంతి కలిగేలా దానిని రూపొందించారు నిర్వాహకులు.

షార్క్ అక్వేరియం గాజును ఢీకొన్నప్పుడు అది పగిలినట్లు అనిపించినా, కొద్దిసేపటికి అది యథాస్థితికి వచ్చేస్తుంది. గ్రెగరీ అక్వేరియం వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న ఘటనను అక్కడున్న కొందరు పర్యటకలు వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో  అప్ లోడ్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 6.3 మిలియన్ మంది వీక్షించారు. ఫేస్ బుక్ లో రెండు లక్షలకుపైగా షేర్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hilarious shark attack  Washington  D.C  aquarium  aquatic beast  scared of shark  

Other Articles