Vodafone announces SuperWeek plan at Rs 69 మాట్లాడేవారికి మాట్లాడుకున్నంత.. డాటా మాత్రం కొంత..!

Vodafone unlimited calls with 500mb data in superweek plan at rs 69

Vodafone Superweek plan, SuperDay plan, Vodafone plans, Vodafone 4G, MyVoda app, Vodafone users, mobile plans, best plans, smart phone, telecom

The Superweek plan offers users unlimited calls on any network, be it a local or STD call. The recharge comes bundled with 500MB of data and is valid for a week.

మాట్లాడేవారికి మాట్లాడుకున్నంత.. డాటా మాత్రం కొంత..!

Posted: 10/26/2017 04:59 PM IST
Vodafone unlimited calls with 500mb data in superweek plan at rs 69

రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం రంగంలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వినూత్న పథకాలను ప్రకటిస్తున్న టెలికాం కంపెనీలు.. ఇప్పటికే వారానికి కేవలం డాటా ఖర్చులను మాత్రమే వసూలు చేస్తామని, వాయిస్ కాల్స్ కు మాత్రం అసలు డబ్బులే తీసుకోమని చెప్పడంతో.. రమారమి అన్ని సంస్థలు ఇలాంటి ప్లాన్ లనే అందుబాటులోకి తీసుకువస్తూ తమ కస్టమర్లను ఇతర సంస్థలపైవు అకర్షితులు కాకుండా పకడ్భంధీ చర్యలు తీసుకుంటున్నాయి.

తాజాగా వొడాఫోన్ కూడా సరికొత్త సూపర్ వీక్ ప్లాన్ ను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వారంలోని ఏడు రోజుల పాటు వాలిడిటీ వుండే ఈ ప్లాన్ కేవలం రూ.69కే తమ ప్రీపెయిడ్ యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్ చేసుకునే వెసలుబాటును కూడా కల్పించిన వోడాఫోన్.. 500 ఎంబీ డేటాను వారం పాటు అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఉత్తమ నెట్ వర్క్ ను, సర్వీసు అనుభవాన్ని తాము అందిస్తున్నట్టు నమ్ముతున్నామని వొడాఫోన్ ఇండియా తెలిపింది.

సూపర్ వీక్ ప్లాన్ తో స్నేహపూర్వకమైన, సరసమైన అపరిమిత ప్లాన్ ను ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు చెప్పింది. ఎలాంటి ఆందోళన లేకుండా ఉచితంగా వొడాఫోన్ సూపర్ నెట్ 4జీ అనుభవాన్ని కస్టమర్లు అనందంలో మునగోచ్చని పేర్కొంది. ఈ ప్యాక్ ను రిటైల్ అవుట్ లెట్లు, యూఎస్‌ఎస్‌డీ, వెబ్ సైట్, మైవొడాఫోన్ యాప్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఏడాదే కంపెనీ సూపర్‌డే, సూపర్‌వీక్ ప్లాన్ ను వొడాఫోన్‌ లాంచ్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vodafone  Superweek plan  SuperDay plan  Vodafone plans  best plans  smart phone  telecom  

Other Articles