West Bengal CID arrests GJM Delhi chief for rioting ఉద్యమం మాటున అశాంతిని ప్రేరేపించిన కుట్రదారు అరెస్టు

Gorkhaland agitation west bengal cid arrests gjm delhi chief for rioting

Bimal Gurung, Darjeeling, Delhi, Gorkha Janamukti Morcha, Gorkhaland agitation, Manoj Shankar, Mamata Banerjee, West Bengal CID, West Bengal police, West Bengal

The West Bengal CID have arrested Gorkha Janamukti Morcha's Delhi unit president Manoj Shankar from the national capital, a CID officer said.

హింస ప్రేరేణ.. నిధుల సాయం.. ఉద్యమనేతకు అరదండాలు

Posted: 10/26/2017 10:47 AM IST
Gorkhaland agitation west bengal cid arrests gjm delhi chief for rioting

ఉద్యమం మాటున రాష్ట్రంలో అశాంతిని, అహింసను ప్రేరేపించిన కుట్రదారుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరదండాలు వేశారు. ఏకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే ఉద్యమాన్ని నడిపి రాష్ట్రంలో ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా కుతంత్రాలు పన్నడంతో పాటు ఇలా హింసను ప్రేరేపించడంతో పాటు తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చేసేందుకు తన ఉద్యమపార్టీకి భారీ మొత్తంలో నిధులను విరాళంగా అందించిన నాయకుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షాత్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు వీలుగా నిధులిచ్చిన గూర్ఖ జనముక్తి మోర్చాకు చెందిన ఢిల్లీ నేతకు కోల్‌‌కతా సిఐడీ పోలీసులు అరదండాలు వేసిన ఘటన సంచలనం రేపింది. సీఎం మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని ఢిల్లీకి చెందిన గూర్ఖా జనముక్తి మోర్చా ఢిల్లీ విభాగాధిపతి మనోజ్ శంకర్ ఉద్యమకారులకు డబ్బులిచ్చాడు. మనోజ్ శంకర్ ఇచ్చిన డబ్బుతో గూర్ఖా లాండ్ ఉద్యమకారులు తుపాకులు కొనుగోలు చేశారని సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది.

ప్రజా భద్రతకు చర్యలకు విఘాతం కలిగించి.. సీఎంకు వ్యతిరేకంగా కుట్రపన్ని గూర్ఖాలాండ్ ఉద్యమం చేపించిన మనోజ్ శంకర్ పై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎంక్లేవ్ నుంచి అరెస్టు చేశామని కోల్ కతా సీఐడీ అదనపు డైరెక్టరు జనరల్ రాజేష్ కుమార్ చెప్పారు. కాగా అతన్ని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించిన తరువాత.. భారీ మొత్తంలో అతనికి డబ్బు ఎలా సమకూరింది.. అతను అంత డబ్బును ఎలా విరాళంగా ఇచ్చాడన్న వివరాలతో పాటు అయన వెనకనున్న పెద్దలెవరన్న వివరాలను కూడా తెలుసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bimal Gurung  Darjeeling  Delhi  Gorkha Janamukti Morcha  Manoj Shankar  Mamata Banerjee  West Bengal  

Other Articles