CM kcr's old friend benifiting TRS party..? ‘‘కేసీఆర్ నెత్తిన పాత మిత్రుడు పాలుపోస్తున్నాడా..?’’

Cm kcr s old friend benifiting trs party alleges ttdp leader

Telangana CM KCR, KCR, TRS, Maha kutami, TTDP, TTDP Revanth Reddy Termination, Revanth Reddy Sack, Revanth Reddy Oust, TTDP Revanth Reddy, Revanth Reddy Issue, Revanth Reddy Chandra Babu Naidu, TTDP Revanth Reddy Remove, TTDP L Ramana Revanth Reddy, Revanth Reddy Ramana, TTDP Ramana Letter Chandrababu, Revanth Reddy Unofficial Ban

Telangana TDP leader Revanth reddy alleges that his old friend of Mahakutaki is taking decisions in favour of CM Kcr, he is the one alone fighting against him

‘‘కేసీఆర్ నెత్తిన పాత మిత్రుడు పాలుపోస్తున్నాడు..’’

Posted: 10/26/2017 11:19 AM IST
Cm kcr s old friend benifiting trs party alleges ttdp leader

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి అనధికారిక బహిష్కరణకు గురైన పార్టీ ఎమ్మెల్యే నేత.. ఇవాళ తన అధ్వర్యంలో నిర్వహించాల్సిన తెలంగాణ టీడీపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించకుండా కాసింత వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మరోమారు రేవంత్ రెడ్డికి.. తన అధికారాలను జాతీయ అధినేత కట్ చేశారన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఇక టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీడీఎల్సీ నాయకుడిగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదని సూచించారు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే తన బాధ్యతలను కొనసాగించాలని తెలిపారు.

దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర అవేదనను వ్యక్తం చేశారు. తన పోరాటం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనేనని, అయితే ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ నెత్తిన పాత మిత్రడు (మహాకూటమిలో) పాలు పోసేలావున్నాయిన అన్నారు. తెలంగాణ టీడీపీ డ్యాడర్, కార్యకర్తలను చూస్తే భాదేస్తుందని ఆయన పేర్కోన్నారు. ఏ నాయకుడైనా క్యాడర్ చెప్పిందే చేయాలని భావిస్తారని, తమ అధినేత కూడా అదే చేస్తారని అన్నారు. చంద్రబాబు వచ్చిన తరువాత అన్ని వివరాస్తానని రేవంత్ చెప్పారు.

అయితే తమ అధ్యక్షుడు వచ్చే లోపు పార్టీని నాశనం చేయాలని కొందరు పార్టీనేతలే పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధినేత వచ్చిన తరువాత ఆయనతో మాట్లాడి.. తమ మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలను సరిద్దిద్దుకోలేని విధంగా కొందరు నేతలు తాపత్రయపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తనను పార్టీలో కొనసాగనీయకుండా కొందరు తమ పార్టీ నేతలు పొమ్మనకుండా పోగబెట్టేస్తున్నారని అయన విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM  KCR  TRS  Maha kutami  Chandrababu  Revanth reddy  Telangana  Politics  

Other Articles