Hardik Patel Ready to Surrender | అరెస్ట్ అవసరం లేదు .. లొంగిపోతాడంట... ఏం చేసుకుంటారో చేస్కోండి

Hardik patel ready to surrender

Hardik Patel, Hardik Patel Arrest, Hardik Patel Surrender, Hardik Patel Gujarat Court, Hardik Patel Police, Hardik Patel Challenge, Patidar Agitation Hardik Patel, Mehsana District, Mehsana Hardik Patel

After Gujarat Court Orders Arrest Orders Hardik Patel Says He ready to Surrender. Hardik Patel faces several police cases for the violence during the agitation to demand quotas in government jobs and education institutions for Gujarat's Patidar, or the Patel community, in north Gujarat's Mehsana district that was the epicentre of the agitation.

హార్దిక్ ను అరెస్ట్ చేస్తారా? చేస్కోండి!

Posted: 10/26/2017 10:18 AM IST
Hardik patel ready to surrender

గుజరాత్ పటేల్ ఉద్యమ యువనేత హర్ధిక్ అరెస్ట్ కు రంగం సిద్ధమైన వేళ.. ఆయన స్పందించారు. తాను లొంగిపోయేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. ఆయనపై నమోదైన కేసుల్లో గైర్హాజరు కావటంతో.. ఆయన్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ‘‘పోలీసులు అరెస్ట్ చేయాలని భావిస్తే, ఆ అవసరం రానీవ్వను. లొంగిపోయేందుకు సిద్ధం. ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. అయితే తనను కటకటాల వెనక్కి నెట్టినా పటీదార్ ఉద్యమం మాత్రం ఆగదని ఆయస పేర్కొన్నారు. బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని.. వారు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని హర్ధిక్ ఆరోపించారు.

కాగా, 2015 పటీదార్ ఉద్యమ సమయంలో ఆయనపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మహేసనా జిల్లాలో హింస చెలరేగగా.. అక్కడ హార్దిక్ ప్రవేశాన్ని నిషేధించారు. నిందితుడిగా కోర్టు విచారణను ఎదుర్కొంటున్న హార్దిక్, ఇటీవలి కాలంలో వాయిదాలకు వెళ్లకపోవడంతో, కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. బుధవారం విచారణకు కూడా గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles