petrol bunks to be closed on friday వాహనంలో ఇంధనాన్ని ఇప్పుడే చూసుకోరూ..

Petrol bunks to be closed on friday

petrol bunks, bandh, telangana, Andhra pradesh, India, strike, petroleum companies, petrol bunk dealers, petrol bunk owners, commission, breaking news, latest news

All petrol bunks in the Telangana state will be closed for a day on friday (October 13) from 6am as a mark of protest against centre demanding to settle their commission.

వాహనంలో ఇంధనాన్ని ఇప్పుడే చూసుకోరూ..

Posted: 10/10/2017 09:08 AM IST
Petrol bunks to be closed on friday

కేంద్రం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణితో గత కొన్నేళ్లుగా తమ సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోట్ బంక్ డీలర్లు బంద్ లో భాగంగా ఇటు తెలంగాణ, అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్రోల్ బంకులను బంద్ చేస్తున్నామని యునైటెడ్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.

దీంతో శుశ్రవారం రోజున పెట్రోలు, డీజిల్‌ క్రయ, విక్రయాలను పూర్తిగా బంద్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ అమరం తెలిపారు. సమస్యల పరిష్కారానికి గత ఏడాది నవంబరులో కేంద్రం సుముఖత వ్యక్తం చేసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినా వాటిని అముల చేసి వర్తింపచేయడంలో మాత్రం ఇంకా నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.

పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. కేంద్రం తమ డిమాండ్ పరిష్కారంపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంకుల్లో నష్టాలను తెలియజేస్తూ అధికారులతో జరిగిన చర్చల్లో అందరూ సానుకూలంగా స్పందించినా... అమల్లోకి మాత్రం రావడంలేదన్నారు. పెట్టుబడులపై రాబడులతో పాటు ప్రతీ ఆరు నెలలకు డీలర్ల మార్జిన్ల సమీక్ష, మానవ వనరుల పెంపు, పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ నష్టాలపై అధ్యయనం తదితర అంశాల పరిష్కారానికి ఓఎంసీలు అంగీకరించాయి. అయితే వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించలేదు’ అని చెప్పారు.   

మూడు చమురు సంస్థల డీలర్లందరూ యునైటెడ్‌ పెట్రోలియం ఫ్రంట్‌గా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు 24 గంటలపాటు బంకుల్లో పెట్రోలు, డీజిల్‌ క్రయ, విక్రయాలను నిలుపుదల(బంద్‌) చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 27 నుంచి నిరవధికంగా పెట్రోలు బంకులను మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol bunks  bandh  telangana  Andhra pradesh  India  strike  petroleum companies  

Other Articles