Depression in Bay of Bengal; heavy rains likely భయపెడుతున్న బంగళాఖాతంలోని తీవ్ర వాయుగుండం

Depression in bay of bengal intensifies into deep depression heavy rains to drench

rain in india, rain in east india, rain in south india, weather in india, depression, depression in bay of bengal, rain in odisha, rain in andhra pradesh, rain in telangana, rain in hyderabad, kolkata rains, rain in kolkata, rain in bhubaneswar, rain in jharkhand, rain in ranchi, bay of bengal, deep depression, heavy rains, telangana, andhra pradesh, hyderabad, weather, breaking news, latest news

After sustaining strength of a depression for a very brief period, the weather system has now intensified into a deep depression over Gangetic West Bengal and adjoining North Bay of Bengal.

నేనూ వచ్చేస్తున్నానూ: భయపెడుతున్న తీవ్ర వాయుగుండం

Posted: 10/10/2017 09:44 AM IST
Depression in bay of bengal intensifies into deep depression heavy rains to drench

ఇప్పటికే యావత్ భారతం భారీ వర్షాలకు తడిసి ముదై.. జనజీవనం స్థంభించింది. అయితే ఇదే సమయంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి.. వర్షాలు కురిపించేందుకు తాను వచ్చేస్తున్నానూ అన్న సమాచారంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తమ దైనందిక పనులు చేసుకోలేక అవస్థలు పడుతుండగా, నేనూ రెడీ అన్న వార్తలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

అయితే తీవ్రవాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై వుండదని వాతావరణ శాఖ స్పష్టం చేసినా.. భారతావనిలోని పశ్చిమ బెంగాల్ పై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని సమాచారం.  కోల్‌కతాకు 50 కిలోమీటర్లు ఉత్తర వాయవ్యంగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలావుండగా, మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితలద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎక్కువచోట్ల, రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ అతలాకుతలం.. శివార్లో అత్యధిక వర్షపాతం

సోమవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం సహా శివార్లలో వరుణుడు భీభత్సం సృష్టించాడు. ఇప్పటికే గత పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంకా నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలోనే వుండగా, సోమవారం కురిసిన వర్షంతో నగరవాసులు అందోళనకు గురయ్యారు. మరీ ముఖ్యంగా బీహెచ్ఈఎల్ రామచంద్రాపురంలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయం నుంచి రాత్రి 12గంటల వరకు ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురిసింది.

సోమవారం రాత్రి కురిసిన వర్షాపాతం వివరాలిలా ఉన్నాయి. రామచంద్రాపురంలో 8.3, మాదాపూర్లో 6.7సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే పాశమైలారంలో 5.4సెం.మీ, తిరుమలగిరిలో 4.7, మల్కాజ్ గిరిలో 4.1, రాజేంద్రనగర్లో 3.9 సెం.మీ వర్షాపాతం నమోదైంది. ఇక గోల్కొండలో 3.7, బేగంపేటలో 3.6, జూబ్లీహిల్స్ లో 3.5సెం.మీ, వెస్ట్ మారేడ్ పల్లిలో 2.6 సెం.మీ, మైత్రివనంలో 2, మోండామార్కెట్లో 1.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bay of bengal  deep depression  heavy rains  telangana  andhra pradesh  hyderabad  weather  

Other Articles