Jaish-e-Mohammad's top commander killed భారత బలగాల చేతిలో ఉగ్రవాద నేత ఖలీద్ ఖతం..

Jaish e mohammad s top commander killed in gunfight in kashmir s baramulla

Terrorist, comandant, encounter, indian forces, baramulla, jaish e mohammad, Operational Head, Khalid, Jaish fidayeen, Kashmir, Baramulla, Jaish Khalid, militant, Pakistan, killed, latest news

A top commander of Jaish-e-Mohammad was killed in a brief gunfight in north Kashmir’s Baramulla district on Monday.

ఉగ్ర నేత ఖలీద్ ఖేల్ ఖతం..

Posted: 10/09/2017 04:17 PM IST
Jaish e mohammad s top commander killed in gunfight in kashmir s baramulla

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మొహ‌మ్మ‌ద్ (జేఈఎం)కు కొలుకోలేని దెబ్బ తగిలింది. అక్రమంగా దేశంలోకి చోచ్చుకోచ్చి.. కాశ్మీర్ ప్రాంతంతో మరీ ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్ లోని బారముల్లా ప్రాంతంలో అలజడులకు ప్రధాన కారణంగా మారిన ఆప‌రేష‌న‌ల్ హెడ్ ఖ‌లీద్ ను ఇవాళ భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హ‌తమార్చాయి. బారాముల్లాలోని ల‌దూరా ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని స‌మాచారంతో రంగంలోకి దిగిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కార్డన్ సర్చ్ నిర్వహించాయి. ఈ నేప‌థ్యంలో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి.

ఈ సందర్భంగా జైషే మెహమ్మద్ అపరేషన్ హెడ్ ఖలీద్ కూడా ఉగ్రవాద ముఠాలో వుండగా, ఇరువర్గాలకు మాధ్య కొంతసేపు పోరు సాగింది. అయితే భారత బలగాలు ఉగ్రవాదులపై పైచేయి సాధించాయి. భారత బలగాల కాల్పుల్లో ఖలీద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గాయపడిన ఖలీద్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించి.. స్థానికంగా వున్న ఓ భవనంలోకి చోరబడ్డాడు. ఈ క్రమంలో భాదర భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఖలీద్ దుర్మరణం చెందాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్ లో శిక్షణ పొంది భార‌త్ లోకి చొర‌బడిన ఖ‌లీద్‌ నార్త్ క‌శ్మీర్ లో ఉగ్ర కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. 2016 అక్టోబ‌ర్‌లో బారాముల్లాలో జైషే మొహ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదుల‌పై దాడి చేసిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు ఖ‌లీద్ గురించి తెలిసింది. అయితే గత అగస్టు నెలలో జైషే ఫిద్దాయూన్ భారత సెక్యూరిటీ బలగాలపై జరిపి తొమ్మిది మంది మరణానికి కారణమైయ్యాడు. ఇదిలావుండగా, కాశ్మీర్ లోని షోఫియాన్ జిల్లాలో కూడా ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలో తలదాచుకున్నారు. భద్రతా దళాలు ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. అందులో ఇద్దరు ఉగ్రవాదలు వున్నట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles