Pawan Kalyan strikes back after Minister's remarks ‘‘సంతోషం’’ అంటూ పవర్ చూపిన పవన్ కల్యాన్

Pawan kalyan strikes back after minister s remarks

pawan kalyan, jana sena, twitter, ashok gajapathi raju, pitahani satyanarayana, santhosham, politics, TDP, JSP, BJP, AP Special Status, power star pawan kalyan, tollywood hero pawan kalyan, politics

Tollywood hero and Jana Sena chief Pawan Kalyan has struck back in his own style. "Ashok Gajapathi Raju Gariki Pawan Kalyan evaro telliyudu. Manthri Pithani gariki Pawan Kalyan ento teliyudu.. SANTHOSHAM," Power Star tweeted this morning.

‘‘సంతోషం’’ అంటూ పవర్ చూపిన పవన్ కల్యాన్

Posted: 10/06/2017 12:36 PM IST
Pawan kalyan strikes back after minister s remarks

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన బాధ్యత తన మిత్రపక్ష పార్టీగా అధికార పీఠమెక్కిన కేంద్రంలోని బీజేపి కన్నా.. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలకు అధిక బాధ్యత వుందని గతంలో అనేక పర్యాయాలు అన్నారు. ఇక ఎంపీలకన్నా అధికాంగా కేంద్రంలో మంత్రి పదవులను చేపట్టిన కేంద్రమంత్రులు ఈ భాధ్యతను తమ భుజాలపై వేసుకోవాలని, లేదంటే తమ మంత్రపదవులను త్యాజించి ఉద్యమంలోకి రావాలని కూడా అన్నారు. అయితే ఇన్నాళ్లు మనౌంగా వున్న టీడీపీ నేతలు పవన్ కల్యాన్ పై నోరుజారారు.

ఈ విషయం తాజాగా తన దృష్టికి వచ్చిన పవన్ కల్యాన్.. తన మనస్సులోని మాటలను రెండు ముక్కల్లో తన అభిమానులకు తెలియజేశారు. అదీ సామాజిక మాధ్యం ట్విట్టర్ ద్వారా. అంతే ఇక ఆ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అవుతుంది. అయితే ఏపీకి పత్ర్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించిన ఆయన అ సమావేశాల సందర్భంగా ప్రస్తావించిన నేతల పేర్లను మరోమారు ప్రస్తావిస్తూ ట్విట్ చేశారు. తన తాజా ట్విట్ లో కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రుల పేర్లను పేర్కోడంతో ప్రకంపనలు రేపుతున్నారు. ఇంతకీ వారెవరూ..? పవన్ కల్యాన్ ట్విట్ లో వారినేమన్నారు..? అంటే..

వారిలో ఒకరు కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, మరోకరు రాష్ట్ర మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌. ఇక పవన్ ట్విట్ ఇలా సాగింది. `అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌దు.. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలియ‌దు.. సంతోషం` అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో పూర్తిస్థాయిలో క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తున్న జనసేన అధినేత.. ఇలా ట్విట్ చేయడంపై అభిమానులు, పార్టీ క్రీయాశీలక కార్యకర్తలు కూడా అండగా నిలుస్తూ విప‌రీతంగా రీట్వీట్ చేస్తున్నారు.

’వాళ్లు మీ ద‌గ్గరికి వ‌చ్చి త‌మ‌ను తామే ప‌రిచ‌యం చేసుకునే రోజు త్వర‌లో వ‌స్తుంది అన్నా!`, అంటూ కొందరు ప్రతిస్పందిస్తే… `నువ్వేంటో చూపించే టైమ్ వ‌చ్చింది అన్నా!` అంటూ మరికోందరు.. తెలుగు రాష్ట్రాలలో పాపులర్ హీరోను.. గత ఎన్నికలలో ఆ పార్టీకి అధికారం అందించిన వ్యక్తిని.. మోడీ, చంద్రబాబులు వున్న వేదికలపై జనమోదం తమ కరతాళధ్వనులతో ఎవరి ప్రసంగానికి హర్షం వ్యక్తం చేశారో.. అలాంటి నేతనే వారు తెలియదంటే.. ఇక సాధారణ ప్రజలను, కనీసం నియోజకవర్గంలోని ఓటర్లను కూడా వారు గుర్తుపట్టే స్థితిలో లేనట్లే అని ఇంకోందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles