Sasikala’s parole approved, expected to be out of jail శశికళకు కండీషనల్ పేరోల్.. ఎన్నిరోజులో తెలుసా..?

Sasikala s parole approved expected to be out of jail

AIADMK, Chennai, Parappana Agrahara Central Jail, Sasikala parole approved, VK Sasikala, Natarajan, Jail superintendent Somashekar, BJP probe, natatajan organ transplant, Tamil Nadu, latest news

Sasikala's parole has been approved by the Bengaluru jail authorities but there are certain restrictions to the parole, violation of which will bar her from seeking parole in the future.

శశికళకు పెరోల్ మంజూరు

Posted: 10/06/2017 12:05 PM IST
Sasikala s parole approved expected to be out of jail

అన్నాడిఎంకే పగ్గాలను అందుకోవాలని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తారువాత శరవేగంగా పావులు కదిపిన అమె చిరకాల నిచ్చెలి, శశికళకు జైలు జీవితం నుంచి ఎట్టకేలకు స్వల్పకాలిక ఊరట లభించింది. తన భర్త అనారోగ్యం నేపథ్యంలో తనకు పక్షం రోజుల పేరోల్ కావాలంటూ జైలు సూపరింటెండెంట్ సోమశేఖర్ కు అమె దరఖాస్తు చేసుకోగా.. దానిని పరిశీలించిన ఆయన అమెకు కండీషనల్ పేరోల్ మంజూరు చేశారు. దీంతో ఇవాళ అమె పరప్పనా అగ్రహర జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

బెంగుళూరు నగరంలోని జైలు నుంచి ఆమె పేరోల్ పై తమిళనాడుకు వెళ్లనున్నారు. అక్కడ తన భర్త నటరాజన్ కు చికిత్స జరుగుతున్న అస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నారు. కాగా ఈ క్రమంలో అమె ఎలాంటి పత్రికా ప్రకటనలను విడుదల చేయరాదని, ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని కూడా అదేశాలు జారీ చేశారు. తన పేరోల్ పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచింది. తమ అదేశాలను పాటించని పక్షంలో శశికళకు జారీ చేసిన పేరోల్ ను వెనువెంటనే రద్దు చేస్తామని కూడా జైలు అధికారులు పేర్కోన్నారు.

కాలేయ వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతున్న తన భర్త కాలేయాన్ని మార్పిడి చేసుకున్న క్రమంలో అమెకు అభ్యర్థన మేరకు జైలు అధికారులు పేరోల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పక్షం రోజుల పాటు పేరోల్ కావాలని అమె అభ్యర్థించినా.. జైలు అధికారులు మాత్రం అమెకు కేవలం ఐదు రోజల పేరోల్ మాత్రమే.. మంజూరు చేశారు. దీంతో అమె ఇవాళ మధ్యాహ్నం జైలు నుంచి విడుదలై.. నేరుగా తన భర్త నటరాజన్ చికిత్స పోందుతున్న చెన్నైలోని గ్లెన్నేజెల్స్ గ్లోబల్ హెల్త్ సిటీకి వెళ్లనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles