Gauri Lankesh to get Anna Politkovskaya Award గ్లోబల్ అవార్డుకు గౌరీలంకేష్.. తొలి భారతీయ పాత్రీకేయురాలు

Gauri lankesh becomes first indian journalist to win anna politkovskaya award

Gauri Lankesh, Journalist, critic of religious extremism, social activist, political activist, bengaluru, Kannada journalist, Anna Politkovskaya Award, Russian Reporter, politics

Kannada journalist Gauri Lankesh, a strident critic of religious extremism who was shot dead last month, has been awarded a prestigious global award, given in the memory of a slain Russian reporter and political activist.

గ్లోబల్ అవార్డుకు గౌరీలంకేష్.. తొలి భారతీయ పాత్రీకేయురాలు

Posted: 10/06/2017 01:14 PM IST
Gauri lankesh becomes first indian journalist to win anna politkovskaya award

మత చాంధసవాదంపై తన కలాన్ని ఎక్కుపెట్టిన ప్రముఖ కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను గుర్తు తెలియని అగంతకులు అమె ఇంటి ఎదురుగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్యమార్చినా.. అమె రచనలు వున్నంత వరకు అమె జీవించే వుంటారని జర్నలిస్టు ప్రపంచం నినదించిన విషయం తెలిసిందే. సరిగ్గా అలాగే అమె ప్రజాహితం కోసం చేసిన సేవలను, రాసిన రచనలు అమె ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యేలా చేశాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించడంతో తొలి భారతీయ జర్నలిస్టుగా గౌరీ లంకేష్ చరిత్రలో నిలిచిపోనున్నారు.

హత్యకు గురైన రష్యాకు చెందిన ప్రముఖ రిపోర్టర్, రాజకీయ కార్యకర్త పేరున వివిధ దేశాల్లో తమ సేవలు, రచనలతో ఖ్యాతిగడించి బెదిరింపులను ఎదుర్కొంటున్న, హత్యగావించబడిన పాత్రికేయులకు ఈ అవార్డును అందజేస్తుంటారు. ఈ అవార్డుకు తాజాగా గౌరీ లంకేశ్ ఎంపికయ్యారు. రీచ్ ఆల్ విమెన్ ఇన్ వార్ (రా ఇన్ వార్) (యుద్దంలో వున్న మహిళలందర్నీ సమీపించు) అన్నా పొలిట్కోవస్కాయా అవార్డును పాకిస్థాన్ కు చెందిన గులాలై ఇస్మాయిల్ తో కలసి గౌరీ లంకేష్ కు ప్రకటించారు.

తాలిబన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సామాజిక శాంతి కార్యకర్త గులాలై ఇస్మాయిల్ కూడా ఉగ్రమూకల నుంచి హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గౌరీ లంకేష్ తో  కలసి గులాలైని కూడా అవార్డులకు సదరు అవార్డు కమిటీ ఎంపిక చేసింది. కాగా,  ప్రజల కోసం పోరాడే వారికి ఈ అవార్డు నైతికంగా మద్దతు ఇస్తుందని లంకేశ్ సోదరి కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు గౌరీకి దక్కినది కాదని, గౌరీ వెనక నిలబడిన అందరిదని ఆమె వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles