Nalgonda Doctor Stabbed To Death By Patient In USA అగ్రరాజ్యంలో దారుణం.. వైద్యుడిని హత్య చేసిన హైదరాబాదీ

Nalgonda doctor stabbed to death by patient in usa

Indian doctor stabbed in US, Achutha N Reddy, Kansas stabbing, Umar Rashid Dutt, Holistic Psychiatric Services, Wichita,Achutha Reddy,NRI,Indian origin doctor kansas,Indian origin doctor,Indian American, latest news

An Indian-origin doctor was stabbed to death in the US state of Kansas and police have arrested a 21-year-old suspect on charges of first-degree murder, officials said.

అగ్రరాజ్యంలో దారుణం.. వైద్యుడిని హత్య చేసిన హైదరాబాదీ

Posted: 09/15/2017 10:56 AM IST
Nalgonda doctor stabbed to death by patient in usa

అమెరికాకు వెళ్లినా.. పరాయి దేశస్థులుగా అక్కడ బతుకులీడుస్తున్నా.. మనవారిలో మాత్రం ఏమాత్రం ఇంకితం పెరగడం లేదన్న మరోమారు నిరూపితమైంది. దేశంకాని దేశంలో ఐక్యంగా కలసిమెలసి వుండాల్సిన మనవాళ్లు.. వాదప్రతివాదనలతో ఏకంగా దాడులు, ప్రతిదాడుల నుంచి హత్యలు కూడా చేసేసి అక్కడి కటకటాల్లో కూర్చుంటున్నారు. ఇలాంటి అహంభావమే తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైక్రియాట్రిస్ట్ డాక్టర్ నాగిరెడ్డి అచ్యుతరెడ్డిని బలితీసుకుంది. 57 ఏళ్ల అఛ్యుత రెడ్డి కాన్సస్ రాష్ట్రంలో సొంతంగా క్లినిక్ పెట్టుకుని సైక్రియాట్రిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అచ్యుతరెడ్డి వద్ద గత కొంతకాలంగా వైద్యం తీసుకుంటున్న ఓ మానసిక రోగే ఈ హత్యకు పాల్పడ్డాడని అగ్రరాజ్యం పోలీసులు తేల్చారు. అయితే హత్యకు వెనుకు గల కారణాలను మాత్రం వారు వివరించలేదు.

అయితే పేషంటుగా గత కొంత కాలంగా అచ్యుత రెడ్డి క్లినిక్ కు వస్తున్న ఉమర్ రషీద్ దత్ కేవలం క్షణికావేశంలోనే హత్య చేసివుంటాడని పోలీసులు బావిస్తున్నారు. కాగా అతను హత్య చేసిన తీరు మాత్రం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. వైద్యుడిగా సేవలందిస్తున్న అచ్యుత రెడ్డిని మానసిక రోగిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి అత్యంత దారుణంగా.. వెంటాడి.. అనేకమార్లు కత్తితో పోడిచి చంపడంమేంటని అచ్యుత రెడ్డి బందువులు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడిగా భావిస్తున్న అగంతకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అగంతకుడు అనేక పర్యాయాలు కత్తితో అచ్యుత రెడ్డిని పొడవడంతో తీవ్ర రక్తస్రావం ఏర్పడి రక్తపు మడుగులో పడివున్నాడని అమెరికా పోలీసులు తెలిపారని నల్గొండ జిల్లాకు చెందిన ఆయన స్నేహితుడు చెప్పారు. హైదరాబాద్ కు చెందిన ఉమర్‌ రషీద్‌ ఈ హత్య చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నట్లు చెప్పారు. వైద్యం విషయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు వివరించారు. అచ్యుతరెడ్డిపై నిందితుడు దాడిచేసినప్పుడు అతని నుంచి తప్పించుకుని పారిపోతున్నా వెంటాడి మరీ పొడిచి చంపినట్లు వెల్లడించారు.

అచ్యుతరెడ్డి మరణ వార్త వినగానే మిర్యాలగూడలోని ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మిర్యాలగూడ సీతరాంపురానికి చెందిన నాగిరెడ్డి భద్రారెడ్డి, పారిజాతం దంపతుల పెద్ద కుమారుడు అచ్యుతరెడ్డి. ఆయన పాతికేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడ భారత సంతతికి చెందిన బీనాను వివాహం చేసుకున్నారు. వారికి రాధ, లక్ష్మి, విష్ణు అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1986లో వైద్యపట్టాను అందుకున్న అచ్యుత రెడ్డి 1989 నుంచి కాన్సస్ లో క్లినిక్ ను నడుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles