Heavy Rain Alert in Telugu States on sat, sunday తెలుగు రాష్ట్రాలకు వర్షం హెచ్చరికలు.. అ రెండు రోజులు..

Heavy rain alert in telugu states for next 72 hours

heavy rain, heavy rains, rains in telugu states, rains in hyderabad, rain alert, rain forecast, weather forecast, weather updates, weather expert, sudden rains, cumulo nimbus clouds, weather forecast, weather in telangana, weather in Andhra pradesh, natural disaster, latest news

indian meteorological department officials warned telugu states of Heavy Rain due to the cumulo nimbus clouds formation.

తెలుగు రాష్ట్రాలకు వర్షం హెచ్చరికలు.. అ రెండు రోజులు..

Posted: 09/15/2017 12:15 PM IST
Heavy rain alert in telugu states for next 72 hours

తెలుగు రాష్ట్రాలల్లోమరో రెండు, మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్ల మీదుగా కొనసాగుతున్న ఉపరితల అవర్తనం, ఉపరతల ద్రోణి నేపథ్యంలో రానున్న శని, అదివారాల్లో అన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అదివారం రోజు తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి  మోస్తారులో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం కూడా తోడవ్వడంతో, కర్ణాటక మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా క్యుములోనిం బస్‌ మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం పడే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో  ఒక్కసారిగా ఉధృతమైన వర్షం కురవడానికి కూడా ఈ మేఘాలే కారణమని తెలిపారు.

ఇప్పటికీ తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈ మేఘాటు దట్టంగా అలుముకునే అవకాశముందని, వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. గత బుధవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్, సంగారెడ్డి, తాండూరులో గరిష్టంగా 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles