Fire breaks out at Cherlapally gas godown ప్రాణాలు అరచేత పట్టుకుని.. పరుగులు.. ఏడుపులు

Fire breaks out at cherlapally gas godown

Fire Accident at LPG gas godown, Fire Accident at Cherlapally, Fire Accident at HPCL plant, short circuit at Cherlapally gas godown, short circiut at cherlapally HPCL Plant, Fire Accident, Fire Accident, LPG gas godown, HPCL Plant, short circuit, Cherlapally, Hyderabad, latest news

A major fire accident in the HPCL gas godown in Cherlapally on the city outskirts caused severe panic in the area. No causalities have been reported.

ప్రాణాలు అరచేత పట్టుకుని.. పరుగులు.. ఏడుపులు

Posted: 09/15/2017 10:12 AM IST
Fire breaks out at cherlapally gas godown

చర్లపల్లి పారిశ్రామికవాడలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్.పీ.సీ.ఎల్‌) ప్లాంటులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో అందులో పనిచేసే కార్మికులు, కార్మికుల కుటుంబాల సభ్యులు అరచేతిలో ప్రాణాలను పట్టుకుని ప్రాణభీతితో పరుగులు తీశారు. స్థానిక ట్రాన్స్ ఫార్మర్ వద్ద చిన్న షాట్ సర్క్యూట్ సంభవించి.. అది కాస్తా ఎల్‌పీజీ గ్యాస్‌ ఫిల్లింగ్ ప్లాంటు పక్కనున్న గ్యాసh గోడౌన్ కు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దంతో గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. కాగా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని రాచకొండ పోలీసులు వెల్లడించారు.

క్రితం రోజు రాత్రి యథావిధిగా కార్మికులు సిలిండర్లలో గ్యాస్ నింపుతున్న క్రమంలో నిప్పురవ్వలు వచ్చి, మంటలు చెలరేగాయి. చిన్న మంటగా ఉన్నప్పుడే కార్మికులు గుర్తించి బయటికి పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే వరుసగా సిలిండర్లు పేలడం మొదలైంది. కొందరు కార్మికులు ఫైర్‌ అలారంను మోగించారు. దీంతో ప్లాంటులో ఉన్న ఇతర సిబ్బంది.. 45 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన రెండు వాటర్‌ ట్యాంకుల్లోని నీటిని ప్లాంటులోకి వదిలారు. దాంతో ప్లాంటులో మొత్తం నీరు వ్యాపించి మంటలు తగ్గాయి.

సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. ప్లాంటు గేట్లు మూసివేశారు. ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. కేవలం రెండు అంబులెన్సులను మాత్రమే లోపలికి అనుమతించారు. అయితే దాదాపుగా కిలోమీటరు దూరం వరకు గ్యాస్ సిలిండర్ల విస్పోటనం శబ్దం వినబుడుతుండటంతో పరిశ్రమకు అగ్నిమాపక శకటాలు చేరకునేందుకు సమయం పట్టింది. ఈ భారీ పేలుడు నేపథ్యంలో స్థానికంగా నివసించే ప్రజలు భయకంపితులయ్యారు. చర్లపల్లి, భరత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, పెద్ద చర్లపల్లి సమీపంలోని ప్రజలు కుషాయిగూడ, నాగారం వైపు పరుగులు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fire Accident  LPG gas godown  HPCL Plant  short circuit  Cherlapally  Hyderabad  

Other Articles