archaeologists examine reasons for Mahakaleshwar Jyotirlingam erosion ఉజ్జయనీ జ్యోతిర్లింగ రహస్యాన్ని చేధిస్తారా..?

Ujjain archaeologists examine reasons for mahakaleshwar jyotirlingam erosion

cmcm, ujjain, archaeological survey of india, asi, avdheshpuri maharaj, bhang, erosion, madhya pradesh, mahakaleshwar jyotirkingum, shringar, ujjain, vidwat parishad, latest news, supreme court, Mahakaleshwar Jyotirlingam, ujjain, archaeologists, erosion, secret, madya pradesh

A team of experts from the Archaeological Survey of India (ASI) conducted an examination of the Mahakaleshwar Jyotirlingam, to find out probable causes for its erosion.

ఉజ్జయనీ జ్యోతిర్లింగ రహస్యాన్ని చేధిస్తారా..?

Posted: 09/09/2017 10:19 AM IST
Ujjain archaeologists examine reasons for mahakaleshwar jyotirlingam erosion

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహా కాళేశ్వర్ జ్యోతిర్లింగం వెనుకనున్న రహస్యాన్ని చేధిస్తారా..? అన్న సందేహాలు ఇప్పుడా పరమశివుడు భక్తులతో పెరిగిపోతుంది. మహా కాలేశ్వర్ జ్యోతిర్లింగం కరిగిపోతున్నట్టు భక్తులు అనుమానంతో పాటు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు అలయ కమిటీ కూడా ఈ విషయమై అందోళన చెందుతుంది. అయతే ఇటు భక్తులు, అటు అలయ కమిటీల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడంతో.. అసలు ఈ మహాలింగం కరిగిపోవడం వెనుకునున్న రహస్యాన్ని కనుగోవాలా వద్దా..? అన్న విషయంలోనే ఏకాభిప్రాయం రాలేదు.

దీంతో కొందరు భక్తులు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి తమ అవేదనను, అందోళనను వ్యక్తం చేస్తూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. అభిషేక ప్రియుడైన భోళా శంకరుడికి భక్తులు ప్రతిరోజు పాలు, పెరుగు, తేనె, నీళ్లతో అభిషేకం చేస్తుంటారు. ఇలా ప్రతిరోజూ అభిషేకాలు చేయడం వల్లే లింగం కరిగిపోతున్నట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇదే తరహాలో దేశవ్యాప్తంగా వున్న జ్యోతిర్లింగాలలో మాత్రం ఏక్కడా మహాలింగాలు కరిగిపోవడం లేదు. దీని వెనుకనున్న రహస్యాన్ని ఏంటో తెలుసుకోవాలని పిటీషన్ లో పేర్కోన్నారు భక్తులు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. జ్యోతిర్లింగం కరిగిపోతుండడం వెనక గల కారణాలను తెలుసుకోవాలంటూ నిపుణుల కమిటీని నియమించింది. దీంతో పురావస్తు శాఖ అధికారులు, భూగర్భ సర్వే శాఖ నిపుణులు ఆలయాన్ని సందర్శించి లింగాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన నివేదికను వచ్చే వారం కోర్టుకు సమర్పించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  Mahakaleshwar Jyotirlingam  ujjain  archaeologists  erosion  secret  madya pradesh  

Other Articles