Let India grow at 8-10% for 10 yrs says raghuram rajan ప్రధాని మోడీ గొప్పలపై రజురామ్ రాజన్ సెటైర్లు..

Raghuram rajan let india grow at 8 10 for 10 yrs before chest thumping

arun jaitley, banks, raghuram rajan, mamata banerjee, chidambaram, demonetisation, Note ban, big scam, Narendra Modi, West Bengal, demonetization, Rs 500, Rs 1000, Reserve bank of India, yearly report, PM Modi, south asian terrorism, urjit patel, jaitley, arun jaitley on bad loans, bad loans, bad loans in india, arun jaitley rbi, arun jaitley rbi report, arun jaitley on rbi report, rbi annual report, rbi annual report 2017

Raghuram Rajan added that India can lecture the world on things such as culture and history, but on growth, it should do that only after achieving 8-10 per cent rate for 10 years.

ప్రధాని మోడీ గొప్పలపై రఘురామ్ రాజన్ సెటైర్లు..

Posted: 09/09/2017 09:36 AM IST
Raghuram rajan let india grow at 8 10 for 10 yrs before chest thumping

గత ఏడాది చేపట్టిన నోట్ల రద్దుతో దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరాయని.. ఈ నిర్ణయం దేశ అభివృద్దిని వేగిరం చేసిందని కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. నోట్ల రద్దుతో దేశప్రజలకు చేకూరింది శూన్యమని.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం తప్పి ప్రజలకు మిగిలింది మాత్రం ఏమీలేదని సెటైర్లు విసిరారు.

నోట్ల రద్దుకు ముందు ప్రధాని చేసిన ప్రసంగాలలో చెప్పిన లక్ష్యాలలో ఏ ఒక్కటీ కూడా నెరవేరలేదని. దీంతో నోట్ల రద్దు మిగిల్చిన గాయాలు దేశాభివృద్దిని గాయపరుస్తున్నా.. దానిని కప్పిపుచ్చి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రచారం చేసుకోవడం ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికే చెల్లిందని ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు నేపథ్యంలో కనీసం పదేళ్లపాటైనా ఏటా 8 నుంచి 10 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించి చూపాలని సూచించారు.

భారతదేశం తన చరిత్ర, సంస్కృతి తదితర విషయాలపై గొప్పలు చెప్పుకోవచ్చు కానీ యావత్ ప్రపంచ అర్థిక వ్యవస్థ నిపుణులు భారత్ నోట్ల రద్దు నేపథ్యంలో అశించిన లక్ష్యాలను అందుకోలేకపోయిందని విమర్శలు గుప్పిస్తున్నా.. ఇంకా ఆర్థిక వృద్ధి విషయంలో గొప్పలు చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఎగుమతులు పెరిగి, ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరిగితే తప్ప భారత స్థూల వృద్ధి రేటు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. భారత్ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, ఐదు రెట్లు ఎక్కువని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ దేశం ఆర్థిక వ్యవస్థ నత్తనడకన నడిచి, అదే సమయంలో భారత జీడీపీ పరుగులు పెడితే తప్ప దానిని అందుకోవడం అసాధ్యమన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్లు పనిచేసిన రఘురామ్ రాజన్ గతేడాది రిటైరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  arun jaitley  banks  note ban  PM Modi  urjit patel  raghuram rajan  RBI  

Other Articles