CBN lay foundation stone for secretariat, assembly విజయదశమి రోజునే ముహూర్తం.. అమరావతికి ప్రత్యేకం..

Cbn lay foundation stone for secretariat assembly and high court

chandrababu naidu, andhra pradesh chief minister, amaravathi, Andhra Pradesh cm, AP Assembly, AP High Court, AP Secretraiat, dussera, vijaya dashimi, housing complex, andhra pradesh capital amaravathi

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu to lay foundation stone for Amaravati Secretariat, High court, Assembly on September 30, 2017.

విజయదశమి రోజునే ముహూర్తం.. అమరావతికి ప్రత్యేకం..

Posted: 09/09/2017 11:02 AM IST
Cbn lay foundation stone for secretariat assembly and high court

రాజధాని లేని రాష్ట్రంగా విజభనకు గురైన నవ్యాంద్ర.. అంచెలంచెలుగా అర్థిక నష్టాన్ని పూడ్చుకుంటూ.. ఇటు రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించిన నేపథ్యంలో ప్రపంచంలో లేని విధంగా అత్యద్భుతంగా శాశ్వత ప్రాతిపదికన రాజధాని నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ విజయదశమి రోజన ముహూర్తాన్ని ఖారారు చేసుకుంది. విజయదశమి రోజున ఏ పని చేపట్టినా దిగ్విజయం కానుందన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కూడా అదే ముహూర్తానికి శ్రీకారం చుట్టనుంది.  

ఈ నెల 30న ఉదయం 8.26 గంటలకు శాసనసభ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన పైల్‌ ఫౌండేషన్‌ పనులకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఇప్పటికే టెండర్లను పిలిచారు. శాసనసభ భవనం, సెక్రటేరియట్, హైకోర్టుతో పాటు ఉద్యోగుల నివాస సముదాయాలను కూడా విజయదశమి రోజునే శంఖుస్థాపనలు చేయనున్నారు.  కాగా హైకోర్టు భవన అకృతిని నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ నెల 13న అందజేయనున్న నేపథ్యంలో దానికి ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో సమావేశమై డిజైన్ల గురించి వివరిస్తారు. హైకోర్టు ఆకృతిని స్థూపాన్ని పోలిన విధంగా రూపొందించిన విషయం తెలిసిందే.

కోహినూర్‌ ఆకృతిలా కనిపించేలా శాసనసభ భవన నిర్మితం కానుంది. మొత్తం నాలుగు అంతస్తులుగా దీన్ని నిర్మిస్తారు. మొదటి అంతస్తులో ఐదు ప్రధాన భాగాలుంటాయి. ఒక దానిలో శాసనసభ, మరో దానిలో శాసన మండలి, మూడో దానిలో సెంట్రల్‌ హాల్‌, నాలుగో భాగంగా కార్యాలయాలు, ఇతర సదుపాయాలు వంటివి ఉంటాయి. ఈ నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. గూగుల్ భవనం కంటే బాగుండాలని సీఎం నిర్దేశించారని దానికి అనుగుణంగానే ఆకృతులు రూపొందిస్తున్నామని శ్రీధర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles