ap minister achennayudu follows minister nara lokesh లోకేష్ అడుగులను ఫాలో అయిన అచ్చెన్న

Ap minister achennayudu follows minister nara lokesh

Minister Achennayudu, TDP party general secretary, Minister Nara Lokesh, jayanthi, vardhanthi, birth anniversary, gauthu latchanna birth anniversary, latest news, politics

Andhra pradesh Minister Achennayudu follows TDP party general secretary and Minister Nara Lokesh saying vardhanthi instead of jayanthi ie birth anniversary

లోకేష్ అడుగులను ఫాలో అయిన అచ్చెన్న

Posted: 08/17/2017 02:23 PM IST
Ap minister achennayudu follows minister nara lokesh

మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అడుగుజాడలను మరో ఏపీకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు ఫాలో అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో నారా లోకేష్ ఏకంగా జయంతి అని వ్యాఖ్యానించడంతో పాటు జోహార్లు సమర్పించేందుకు అంబేద్కర్ వర్థిలాలి అంటూ ఈ రోజును అందరూ పండగగా జరుపుకోవాలని వ్యాఖ్యానించడంతో సభలోకి వారు కొంత విస్మయానికి గురయ్యారు. ఆనక తన తప్పును తెలుసుకున్న ఆయన వాటిని సరిచేసుకున్నారు.

తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు కూడా అదే ఫాలో అయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతిని మంత్రి అచ్చెన్నాయుడు వర్ధంతి అనడమేకాక, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై జయంతికి బదులు వర్థంతి అని సంబోధించడం సభలోని వారితో పాటు మీడియా ప్రతినిధులను కూడా నవ్వుకునేలా చేసింది.

గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో పక్కన ఉన్న సహచరులు మంత్రి వ్యాఖ్యలను సరిచేశారు. అయితే అప్పటికే ముసిముసి నవ్వులు నవ్వుతున్న మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా గట్టిగా నవ్వేలా చేసాయి అచ్చెన్న వ్యాఖ్యలు. నారా లోకేష్ సాహచర్యం వల్ల తనకు కూడా అలానే వచ్చిందని వ్యాఖ్యానించడడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gauthu latchanna  birth anniversary  Achennayudu  Nara Lokesh  jayanthi  vardhanthi  politics  

Other Articles