HC gives green signal to kakinada corperation elections కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలకు పచ్చజెండా..

High court gives green signal to kakinada corperation elections

green signal to kakinada corporation elections, High Court gives green signal to kakinada elections, Kakinada Municipal Corporation elections, high court, kakinada corportaion, TDP, YCP, Congress, Left parties, Elections latest news, politics

High Court gives green signal to kakinada corporation elections, says cant stay elections after notification is issued

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలకు పచ్చజెండా..

Posted: 08/17/2017 03:15 PM IST
High court gives green signal to kakinada corperation elections

కాకినాడ మున్సిఫల్ కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికలు జరుగుతాయా... లేదా..? అని ఉత్కంఠగా ఎదురుచూసిన అశావహులతో పాటు కార్పోరేషన్ ప్రజలకు కూడా ఎన్నికల తరువాత కొత్త పరిపాలనా బాడీ వస్తుందన్న శుభవార్తను అందించింది. కాకినాడ మున్సిఫల్ ఎన్నికలను.. ఎన్నికల కమీషన్ ఇచ్చిన షెడ్యూల్డు ప్రకారం  నిర్వహించాలని అదేశాలను జారీ చేసింది. కాకినాడ మున్సిఫల్ కార్పోరేషన్ ఎన్నికలలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారన్ని దాఖలైన వాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ మేరకు అదేశాలను జారి చేసింది.

నిబంధనలను ఉల్లంఘించారన్న వార్తలు నేపథ్యంలో ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వార్డుల పునర్‌ విభజన, రిజర్వేషన్ల ఖరారును విషయంలో ఎన్నికల కమీషన్ నిబంధనలను ఉల్లంఘించిందని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇటు పిటీషనర్ సహా అటు ప్రభుత్వ వాదనలను కూడా వినింది.5 లక్షల మందికి 50 వార్డులు వుండాలన్న నిబంధనలను పాటించలేదని వాటిని కుదించి.. కేవలం 48 వార్డులనే ఏర్పాటు చేసి వాటికే ఎన్నికలు జరుపుతున్నారని పిటీషనర్ వాదించారు. ఎన్నికలపై స్టే విధించాలని కోరాడు.

కాగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత ఎన్నికల అపడం కుదరదని ప్రభుత్వం బలంగా తమ వాదనలు వినిపించింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. ఇవాళ తీర్పును వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం న్యాయస్థానం స్పష్టం చేసింది.  ఇక ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణత షెడ్యూల్డుకు అనుగూణంగానే ఎన్నికలను నిర్వహించాలని అదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  kakinada municipal corportaion  TDP  YCP  Congress  Left parties  Elections  

Other Articles