Bala Krishna Slaps Fan, Once Again! నంద్యాలలో అనవాయితీ కొనసాగించిన బాలయ్య..

Actor politician balakrishna caught on camera slapping fan

balaiah thrashes fan, balaiah slaps fan, actor, balakrishna, nandyal, by elecctions, fan slapped, hotel, kurnool, hindupur mla, TDP campaigner, andhra pradesh, balakrishna news, tollywood news, latest news, politics

Nandamuri Balakrishna has slapped someone again. The incident occurred on Wednesday when the actor was in Nandyal to campaign for the upcoming bypoll and a fan tried to get too close.

ITEMVIDEOS: నంద్యాలలోనూ బాలయ్య అనవాయితీ.. ఫ్యాన్ పై ఫైర్..

Posted: 08/17/2017 01:20 PM IST
Actor politician balakrishna caught on camera slapping fan

ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నంద్యాల ఉపఎన్నికలలో కూడా తన అనవాయితీని కొనసాగించారు. ఇప్పటికే ముక్కోపి అని విమర్శలు ఎదుర్కుంటున్న ఆయన తన అభిమానులపై చేతివాటం ప్రదర్శించడమే అనవాయితీగా పెట్టుకున్నారన్న వ్యంగవిమర్శలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినిమాలలో ఈ ధోరణిని అభిమానులు అంతగా పట్టించుకోకపోయినా.. ఎన్నికలలో మాత్రం ఓటర్లు దాని ప్రభావాన్ని కచ్చితంగా తమ ఓటు రూపంలో ప్రదర్శిస్తారన్న విషయాన్ని మర్చిపోయాడు బాలయ్య.

ఇటీవల తన అసిస్టెంట్ ను కొట్టి పతాక శీర్షికలకు ఎక్కిన ఆయన.. ఆ తరువాత గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర ప్రదర్శనను తిలకించి వస్తున్న క్రమంలో తనతో సెల్పీ దిగేందుకు యత్నించిన అభిమాని ఫఓన్ కూడా కిందపడేసి తన అవేశానికి అవధులు లేవని మరోమారు రుజువు చేసుకున్నాడు. తాజాగా నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ కార్యకర్తైన తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. నంద్యాలోని తాను బస చేస్తున్న హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ అభ్యర్థికి బ్రహ్మానంద రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి హోటల్ కు చేరకున్నాడు. అతని రాకను గమనించి అభిమాని గజమాలను తీసుకువచ్చి ఆయన మెడలో వేసేందుకు ప్రయత్నించారు. అయితే దానిని దూరం నుంచి పట్టుకుని పక్కకు వేసేందుకు బాలయ్య సిబ్బంది ప్రయత్నించగా, మెడలో వేసేందుకని పట్టుకన్న అభిమాని చెంపను చెల్లమనిపించాడు బాలయ్య.

సినీమా స్టార్ గా అయితే అభిమానులు ఆ క్షణంలో రుసరుసలాడినా.. తరువాత తమ అభిమానాని చంపుకోలేక హద్దుల్లో వుండాలని తెలుసుకుని మెలుగుతారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చి తన అనవాయితీని కొనసాగించడంతో.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, శ్రేణులు ఆయన చర్యలతో ఒక్కసారిగా బిక్కముఖం వేశారు. బాలకృష్ణ దురుసు ప్రవర్తనతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో అధికార పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా సంచలనంగా మారడంతో.. టీడీపీ నాయకులు కలవర పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor  balakrishna  nandyal  by elecctions  fan slapped  hotel  kurnool  hindupur mla  TDP campaigner  politics  

Other Articles