Southwest monsoon weakening over Telangana తెలుగు రాష్ట్రవాసులకు అలర్ట్.. అన్నదాతలకు గుడ్ న్యూస్

Heavy rains alert in andhra pradesh and telangana

Southwest monsoon ,Telangana State, Rains, lighting, thunder storms, upper air cyclonic circulation, coastal andhra, odisha, Tamil Nadu

MeT Departement warned of heavy rains at isolated places in all the districts of the State on August 16 and 17 because of the upper air cyclonic circulation over coastal Tamil Nadu and its neighbourhood.

తెలుగు రాష్ట్రవాసులకు అలర్ట్.. అన్నదాతలకు గుడ్ న్యూస్

Posted: 08/14/2017 11:20 AM IST
Heavy rains alert in andhra pradesh and telangana

ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఒడిశా నుంచి దక్షిణ కోస్తా మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల అవర్తనం కారణంగా అంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడుతుండగా… తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు వున్నాయని చెప్పారు.

కోస్తాంధ్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత విస్తరించే అవకాశాలు మెండుగా వున్నాయని, వీటి కారణంగా ఈ నెల 16, 17 అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అవర్తనం ప్రభావంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, గచ్చిబౌలి, మియాపూర్, పటాన్ చెరు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు.

అటు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, తాండూరు, మహబూబ్ నగర్, యాదాద్రి, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాచారం, అదిలాబాద్, మేడ్చల్, ఖమ్మం, సహా పలు జిల్లాల్లో వరుణుడు కరుణించడంతో రైతన్నలు సంబరపడుతున్నాడు.  ప్రతీసారి వాన రావమ్మ అని ఎదురుచూసే తమపై ఇన్నాళ్లకు వరుణుడు కరుణించాడని అన్నదాతలపై సంబరపడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు మరింత ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా పత్తి, కంది, మొక్కజొన్న, సోయా తదితర పంటలకు నీరందుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. కాగా 16. 17 రోజుల్లో అనేక ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles