SC refuses suo motu cognizance, dismisses plea చిన్నారుల మరణాలు కుదిపేస్తున్నా.. వేడుకలకు అదేశాలా.?

Yogi adityanath orders grand janmashtami celebrations in up

UP childrens deaths, gorakhpur hospital, brd medical college, gorakhpur deaths, gorakhpur tragedy, yogi adtiyanath, yogi janamashtmi, grand janmashtami celebrations, gorakhpur, gorakhpur children death, gorakhpur hospital tragedy, gorakhpur hospital, yogi adityanath, jp nadda, brd medical college, sri krishna janmashtami, uttar pradesh

The state is mourning the death of over 68 infants in Gorakhpur, Uttar Pradesh Chief Minister Yogi Adityanath has directed preparations for a “grand Krishna Janmashtami celebration”.

చిన్నారుల మరణాలు కుదిపేస్తున్నా.. వేడుకలకు అదేశాలా.?

Posted: 08/14/2017 12:09 PM IST
Yogi adityanath orders grand janmashtami celebrations in up

ఉత్తర్ ప్రదేశ్ లో చిన్నారుల మరణాలు కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా విషాధఛాయలు అలుముకుంటే.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాత్ మాత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధికారులకు అదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీలో గత వారం రోజుల వ్యవధిలో సుమారు 70 మందికి పైగా చిన్నారుల మరణాల సంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ మరణాలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మెదడువ్యాపు వ్యాధి విభాగానికి నోడల్‌ అధికారిగా కోనసాగుతూ.. తన సొంత డబ్బులతో చిన్నారులకు ఆక్సిజన్ సిలిండర్లు కొని అదర్శప్రాయుడిగా ప్రచారం పోందిన డాక్టర్ ఖలీఫ్ ఖాన్ పై వేటు వేసిన రాష్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న విమర్శలు వస్తున్నాయి. కలీఫ్ ఖాన్ తన విధులను ఉల్లంఘించి.. ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్నందుకు అతనిపై వేటు వేశామని, అయితే ఏ డాక్టరుపై తాము వ్యక్తిగతంగా అరోపణలు చేయదలుచుకోలేదని ఢిఫ్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యా క్రితం రోజున మీడియాకు చెప్పారు.

తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో చిన్నారుల మరణాల నేపథ్యంలో రాష్ట్రం విషాధఛాయలు అలుముకుంటున్నా.. ముఖ్యమంత్రి మాత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేయాలని అదేశాలు వెలువరించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా పెద్ద, ప్రాముఖ్యత కలిగిన పండగని, దీనికి సంప్రదాయపరంగా, ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్వయంగా డీజీపీ సుల్ఖాన్ సింగ్ కు అదేశాలు జారీ చేశారు.  

అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి దేశీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించాలని అయన అదేశాలు జారీ చేయడమే హాట్ టాపిక్ గా మారింది. ఇదిలావుండగా, చిన్నారుల మరణాలను సుమోటో కేసుగా స్వీకరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన వాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలన్న వాజ్యాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాదిని ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ రాష్టోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles