toll raises to 60 in Himachal Landslide tragedy హిమాచల్ దుర్ఘటనలో 60కి చేరిన మృతుల సంఖ్య

60 killed as two buses hit by massive landslides himachal s mandi

chamba, himachal pradesh, Mandi, Mnadi landslides, Pathankot, landslides himachal mandi, luggar hati, chamba, manali, buses, katra, Himachal Pradesh landslide, Manali, NDRF, Narendra Modi, Cooch, Kotpuri, Purnia, Himachal Pradesh

In a tragic incident, Two Himachal roadway buses were hit by a massive landslide triggered by a cloudburst on the Mandi-Pathankot National Highway, leaving 60 passengers dead.

హిమాచల్ ప్రమాదం: 60కి చేరిన మృతుల సంఖ్య

Posted: 08/14/2017 10:44 AM IST
60 killed as two buses hit by massive landslides himachal s mandi

హిమాచల్ ప్రదేశ్ లోని మండీ-పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై కొట్రుపి వద్ద కొండచరియలు విరిగి పటడంతో సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఉదయం వరకు ఈ ప్రమాదంలో 60 మంది అసువులు బాసారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో క్రితం రోజు రాత్రి వరకు 46 మృతదేహాలను వెలికితీసిన సహాయక బృందాలు వెలికి తీశాయి. అయితే వారిలో 23 మందినే గుర్తించగలిగారు. మిగిలినవారిని గుర్తించడానికి ఫోరెన్సిక్‌ నిపుణుల్ని రంగంలో దించారు. 12 మంది క్షతగాత్రుల్ని మండీలోని ఆసుపత్రులకు తరలించారు.

కొట్రుపి వద్ద రెండు బస్సుల్లోని ప్రయాణికులు టీ తాగేందుకు బస్సును నిలిపిన సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక వాల్వో బస్సు మనాలీ నుంచి కాట్రాకు, రెండోది మనాలీ నుంచి చాంబాకు వెళ్తూ కొట్రుపి వద్ద అగాయి. ఈ రెండు బస్సులతో పాటు మరో కారు కూడా అక్కడ నిలిపివుంది. కుండపోతగా కురిసిన వర్షం తీవ్రతకు 250 మీటర్ల విస్తీర్ణం ఉన్న కొండచరియలు విరిగిపడటంతో.. ఆ ధాటికి బస్సులు పక్కనున్న లోయలోకి సుమారు 800 మీటర్ల లోతున్న లోయలోకి జారిపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.

జాతీయ విపత్తు ఉపశమన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), జమ్ము నుంచి తరలి వచ్చిన సైనిక బలగం కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. మరిన్ని కొండచరియలు విరిగి పడవచ్చనే భయంతో ఆదివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు నిలిపేశారు. కొట్రుపిలో స్థానికులు తమ ఇళ్లువాకిళ్లను వదిలి అడువుల్లోకి పరుగులు తీసి తలదాచుకున్నారు. మృతదేహాలకు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించింది. హిమాచల్ ఈ భారీ ప్రాణనష్టం చేకూరేలా ఇలాంటి ఘటనలు సంభవించడం ఇది మూడోసారి.

కాగా ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలంగాణ వాసులు కూడా ప్రాణాలను కొల్పోయారు. యాదాద్రి జిల్లా భువనగిరి, నల్గోండ జిల్లాలకు చెందిన జంపల్లి వాసి కొంతం రాజిరెడ్డి, నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన దుబ్బాక కొండల్ రెడ్డిలు తమ ఉద్యోగ బాధ్యత్తలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి.. ప్రాణాలను కొల్పోయారు. వీరిద్దరూ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంస్థల్లో మేనజర్లుగా పరిచేస్తున్నారని, ఉద్యోగ విధుల్లో భాగంగా కొట్రుపి వెళ్లిన వీళ్లు ప్రమాదం బారిన పడి ప్రాణాలను కోల్పోయారని సమాచారం అందిందని గ్రామస్థులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mandi landslide  Himachal Pradesh landslide  Manali  NDRF  Narendra Modi  Cooch  Kotpuri  Purnia  Himachal Pradesh  

Other Articles