dance academy director sexually harassed by collegue హైదరాబాదులో కాల్ మనీ కలకలం.. లైంగిక వేధింపులు..

Dance academy director sexually harassed by collegue

call money case, dance academy director, sexual harassment, LB Nagar, Rachakonda Police, isak rubin, crime

dance academy director sexually harassed by collegue and public relation officer of the academy in LB nagar og hyderabad.

హైదరాబాదులో కాల్ మనీ కలకలం.. లైంగిక వేధింపులు..

Posted: 08/14/2017 10:43 AM IST
Dance academy director sexually harassed by collegue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన కాల్ మనీ కేసు తరహాలోనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడా కాల్ మనీ కేసులు నమోదైన పోలీసులు ఉక్కుపాదం మోపడంతో.. సోంతగూటికి చెందిన ఏఎస్ఐ సైతం కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. తాజాగా ఇదే తరహాలో హైదరాబాద్ ఎల్బీనగర్ లో నమోదైన కేసు కలకలం రేపింది. డ్యాన్స్ అకాడమి డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ మహిళకు అప్పగా డబ్బులిచ్చి అమెతో అసభ్యంగా ప్రవర్తించిన కేసు సంచలనంగా మారింది.

మహిళ పిర్యాదుతో రంగంలోకి దిగిన ఎల్బీనగర్ పోలీసులు.. లైంగికంగా వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నర్సింహ తెలిపిన వివరాల మేరకు కేసు వివరాలు ఇలా వున్నాయి. వనస్థలిపురానికి చెందిన 32 ఏళ్ల మహిళ శివగంగ కాలనీలో డ్యాన్స్‌ అకాడమిలో డైరెక్టర్‌గా పనిచేస్తుంది. అదే సంస్థలో పనిచేస్తున్న శ్రీశంకర్ కాలనీకి చెందిన ఈసాక్‌ రూబిన్‌(28) అకడమీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.
 
ఇద్దరూ డాన్స్ అకాడమీలో పనిచేస్తున్నందున ఇద్దరి మధ్య పరిచయం పెరింగింది. దీంతో తనకు అవసరం రావడంతో ఆమె ఇసాక్‌ రూబిన్‌ వద్ద రూ.27 వేలు అప్పుగా తీసుకుంది. దీనిని ఆసరాగా తీసుకున్న రూబిన్.. అప్పు డబ్బులను తీర్చమని గడువులోపు అమెను కోరాడు. డబ్బు చెల్లిస్తానని కొంత సమయం కావాలని అమె కోరింది. అయితే దానిని అదునుగా చేసుకుని బాధితురాలి పట్ల రూబిన్ అసభ్యంగా ప్రవర్తించసాగడు. తనకు వెంటనే డబ్బులు చెల్లించాలని లేక పక్షంలో కోరిక తీర్చాలంటూ అమెతో అసభ్యంగా ప్రపర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

లైంగిక వేధింపులు భరించలేక బాధితురాలు.. రూబిన్ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ నెల 10న అకాడమిలో  అసభ్యంగా ప్రవర్తించాడు. అతని చేష్టలతో విసుగు చెందిన బాధితురాలు.. రూబిన్ పై భర్త సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. తన గురించి తమ ఇంట్లో కూడా చెడుగా ప్రచారం చేస్తానని తన భర్త, అత్తామామలకు చెడుగా చెబుతానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పిర్యాదులో పేర్కోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కినెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles