Is sex with minor wife rape? SC to examine issue మైనర్ భార్యలతో శృంగారం.. అత్యాచారమా..?

Govt defends no action for forced sex with wife aged 15 17

Child bride, Sex with minor wife, Minor, Wife, anti-child marriage law, Supreme Court, parliament, NGO, Madan B Lokur, Deepak Gupta, Agarwal

The supreme court was hearing a PIL filed by an NGO asking to fix the age of consent of a wife at 18 years for having sex with husband, which asked to make an exception on age of consent of the wife for sex.

మైనర్ భార్యలతో శృంగారం.. అత్యాచారమా..?

Posted: 08/10/2017 10:02 AM IST
Govt defends no action for forced sex with wife aged 15 17

భారత వివాహ బంధానికి వున్న ఔనత్యాన్ని గుర్తించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం భార్యలతో భర్తలు సాగించే బలవంతపు శృంగారాన్ని (మారిటల్ రేప్) ను నేరంగా పరిగణించలేమని తేల్చచెప్పింది. ఇదే విషయాన్ని అటు కేంద్రం కూడా సమర్థవంతంగా తన వాదనలు వినిపించింది. భారత వైవిహిక వ్యవస్థపై వున్న నమ్మకాలు, అచారాలను హిందూ వివాహ చట్టం సమ్మతించి అందుకు అనుగూణంగానే నిర్ణయాలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో దీనిపై ఇరువర్గాల వారి వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడింది.

మరీ ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మైనర్ బాలికలకు వివాహాలు చేసిన అనంతరం వారితో బలవంతంగా భర్తలు శృంగారాలను చేస్తున్నారని.. వారి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా సాగించే ఇలాంటి బలవంతపు శృంగాలను కూడా అత్యాచారంగా పరిగణించాలని పిటీషన్ పై కీలక తీర్పు వెల్లడిస్తూ వివాహ అనంతరం జరిగే శృంగారాలను పరిగణించలేమని పేర్కొంది. మైనర్ అయిన భార్యతో శృంగారాన్ని నిబంధనలు అనుమతించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది.

అయితే ఇందులోనూ కొన్ని మినహయింపులను ఇచ్చిన కేంద్రం.. వయస్సు అధారాంగా పలు పరిమితులను విధిస్తూ తీర్పును వెలువరించింది. భారత శిక్షా స్మృతి 375 ప్రకారం.. భార్య వయసు 15 ఏళ్ల లోపు ఉంటే కనుక ఆమె సమ్మతంతో జరిగినా.. లేక అయిష్టంగానే బలవంతంగా అమెతో శృంగారం చేసిన పక్షంలో అది నేరం కింద పరిగణిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనర్ బార్యలయినా.. వారి వయస్సు 15కు మించిన పక్షంలో ఆమె అంగీకారంతో పనిలేకుండా శృంగారంలో పాల్గొన్నా దానిని నేరంగా పరిగణించలేమని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Child bride  Sex with minor wife  Minor  Wife  anti-child marriage law  

Other Articles