Rana gets snake bites to compensate for addiction కిక్కు కోసం రాణా విషాన్ని నమ్ముకుని.. చివరకు...

Rana gets snake bites to compensate for addiction lands on hospital bed

Rana Pateshwar Singh, hospital. man gets snake bite, bihar man compensate for addiction, man compensate for liquor, cobra, snake bite, Rana Pateshwar Singh, hospital. man gets snake bite, bihar man compensate for addiction, man compensate for liquor, cobra, snake bite, addiction, liquor, bihar, liquor, bihar

Rana Pateshwar Singh (50), in Bihar landed in hospital after exposing himself to frequent snake bites, a practice he believed would compensate for his liquor addiction.

కిక్కు కోసం రాణా విషాన్ని నమ్ముకుని.. చివరకు...

Posted: 08/09/2017 06:42 PM IST
Rana gets snake bites to compensate for addiction lands on hospital bed

కిక్కు కోసం ఎవరెవరో ఏమోమో చేస్తుంటారు. కొందరు మద్యం తాగితే.. మరికోందరు మరో మార్గాలను అన్వేషిస్తారు. అయితే రోజు తాగే వాడికి మద్యం నిషేదం పెద్ద శాపమే. అంతేకాదు మద్యనిషేదం చేయడంతో పాటు అ మద్యం పట్టుకున్నా, సేవించినా, రవాణా చేసినా కఠిన శిక్షలు వేస్తుండటంతో మత్తు కోసం ఓ బీహార్ వాసి ఏకంగా ‘విష’ విధానాన్ని అవలంబించాడు. కాగా, డోసేజ్ ఎక్కువకావడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పరిస్థితి విషమించడంతో చివరి నిమిషంలో ఆసుపత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించి ప్రాణాలు దక్కించుకున్నాడు.

మద్యం సేవించకుండా ఒక్క రోజు కూడా వుండలేని బీహార్ రాష్ట్రానికి చెందిన రైతు.. బీహార్ సిఎం నితీష్ కుమార్ మద్య నిషేధం అమల్లోకి తీసుకురావడంతో.. దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. నిషా లేనిదే నిద్రరాని రైతు తొలుత దొరికిన చోటల్లా మద్యాన్ని నల్లబజారులో తెచ్చుకున్నాడు. కళిన శిక్షల నేపథ్యంలో ఎవరూ మద్యం జోలికి వెళ్లకపోవడంతో మందు దొరక్క రైతు ఏకంగా మత్తు కోసం నాగుపామును ఆశ్రయించాడు. తన గ్రామానికి చెందిన ఓ పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి నాగుపామును తెప్పించుకున్నాడు.

తనకు మద్యం కావాలని అనిపించినప్పుడల్లా ఆ విషనాగు చేత కాటు వేయించుకోసాగాడు. ఈ నేపధ్యంలో ఉన్నట్టుండి ఒకరోజు ఏకంగా మూడు సార్లు పాము చేత కాటు వేయించుకున్నాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్థానికులు అతన్ని హుటాహుటిన అస్పత్రికి తరలించడంతో చేర్పించి చికిత్స అందించారు. ఆ రైతు పేరు రాణా పతేశ్వర్(50) బీహార్‌లోని సమస్తీపూర్‌లో గల వసీనగర్‌కు చెందినవాడు. పాము కాటు రోజు అలవాటు పడటంతో అతని శరీరమంతా విషం పాకిపోయిందని వైద్యులు తెలిపారు. తమ ప్రయత్నాలు ఫలించి రాణా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Pateshwar Singh  hospital. cobra  snake bite  addiction  liquor  bihar  

Other Articles