Bihar BJP Minister Calls Journalists Pakistani Supporters పాకిస్తానీయులని.. క్షమాపణలు చెప్పిన మంత్రి

Bihar bjp minister calls journalists pakistani supporters

Bharat Mata Ki Jai Row, BJP JDU, Pak, patna, vinod singh, bihar minister vinod singh, bharat mata ki jai, bharat mata ki jai, new delhi, pakistan

Bihar Minister Vinod Singh who dubbed journalists' as Pakistan supporters for not chanting 'Bharat Mata Ki Jai' on Wednesday defended his stance and said that his statement was wrongly interpreted.

పాకిస్తానీయులని.. క్షమాపణలు చెప్పిన మంత్రి

Posted: 08/09/2017 12:34 PM IST
Bihar bjp minister calls journalists pakistani supporters

వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపి పార్టీ నేతలు వార్తల్లో నిలుస్తున్నారు. అడవారికి అర్థరాత్రిళ్లు ఏం పని అంటూ నిలదీసిన బీజేపి హర్యానా ఉపాధ్యక్షుడి ఘటనను మరువక ముందే.. మరో బీజేపి మంత్రి ఏకంగా ప్రజలకు ప్రభుత్వానికి మద్యన నిలిచే వారధులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పార్టీ నేతలు అనవసరంగా నోరు జారకూడదు అంటూ పార్టీ అధిష్టానం అదేశాలను ఇస్తూనే నేతలు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలంటారు. కేవలం మీడియా ముఖ్యంగా నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకోవాలంటే అది ఎంతవరకు సముచితం. దేశభక్తి అన్నది నినాదాలతో రుజువు చేసుకునేది కాదు.. దేశం కోసం మనం ఏం చేశామన్నదానిపై అధారపడి వుంటుంది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నట్లుగా దేశం కోసం నినదించడం కాన్నా దేశంలోని కడుపేదల కడుపు నింపేవాడు గోప్పవాడదని మరవులేని సత్యం. బీహార్‌ మంత్రి, బీజేపీ నేత వినోద్‌ కుమార్‌ ఇలా వ్యవహరించి.. తాను అశించిన మేరకు స్పందన రాకపోవడంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మీడియా ప్రతినిధులు పాకిస్తానీలంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపి పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో సహనం కోల్పోయిన ఆయన ఈ కామెంట్లు చేశారు. బీహార్ లో బీజేపి మద్దతుతో ఏర్పడిన జేడీ(యూ) ప్రభుత్వంలో ఈ సీనియర్ నేతను పార్టీ అధిష్టానం గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఒక్కసారిగా భారత్ మాతా కీ జై అంటూ నినందించారు. అయితే అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో అసహనానికి గురైన ఆయన మీరు పాకిస్థాన్ మాతాకి మద్దతుదారులేనంటూ ఆగ్రహాం వెళ్లగక్కారు.

ఆయన కామెంట్లపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయగా, మిగతా వారెవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ మసీదుల్లో ఆజాన్‌, చర్చిల్లో గంటల శబ్ధాలకు బదులు భారత్ మాతాకీ జై నినాదాన్ని వినిపించాలంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే కాసేపటికే తాను అలా చెప్పలేదని పేర్కొనటం విశేషం. ఇక వీటిపై జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ స్పందిస్తూ అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ అని తెలిపారు.

కాగా వివాదం పెద్దగా మారడంలో నాలుక కర్చుకున్న మంత్రి వినోద్ కుమార్ సింగ్ తాను తన జీవితంలో ఇప్పడి వరకు ఎవరినీ కించపరుస్తూ, అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భారత్ మాతాకి జై అన్న అంశమై తన స్టాండును అలాగే కొనసాగించిన మంత్రి, తాను మాట్లాడింది మాత్రం తప్పుగా అర్థం చేసుకుని.. మీడియా వివాదాస్పదం చేసిందని పేర్కోన్నారు. తాను మాట్లాడిన వీడియో చూస్తూ తన సెంటిమెంట్లు తప్పుకావని అన్నారు. మీడియా మిత్రుల సెంటిమెంట్లను అగౌరవపర్చానని భావించరాదని క్షమాపణలు చెప్పారు, తనకు మీడియా మిత్రులంటే చాలా గౌరవమని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Minister Vinod Kumar singh  Controversial Comments  journalists  pakistan  bharat mata  patna  Bihar  

Other Articles