PV sindhu takes charge as deputy collector బాధ్యతలను స్వీకరించిన డిఫ్యూటీ కలెక్టర్ సింధూ..

Pv sindhu takes charge as deputy collector

pv sindhu, deputy collector, ap government, gollapudi, vijayawada, badminton, ccla

Olympic silver medallist P V Sindhu, who has been appointed a Group-I officer in Andhra Pradesh today joined to and took charge as deputy collector

బాధ్యతలను స్వీకరించిన డిఫ్యూటీ కలెక్టర్ సింధూ..

Posted: 08/09/2017 11:42 AM IST
Pv sindhu takes charge as deputy collector

భారత బాడ్మింటన్ స్టార్, రియో ఒలంపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధూ.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రూప్ 1 ఉద్యోగిగా మారారు. ఇందుకోసం అమె విజయవాడ సిటీలోని గొల్లపూడిలో గల ఆంధ్రప్రదేశ్‌ భూపరిపాలన (సీసీఎల్‌ఏ) కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి.. బాద్యతలను చేపట్టారు. ఈ మేరకు సింధు.. డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్‌ పునేఠాకు రిపోర్ట్‌ చేసిన అనంతరం అమెకు బాద్యతలను అప్పగించారు అక్కడి అధికారులు.

అయితే, ఆమెకు ఎలాంటి పనులు అప్పగిస్తారనేది ఇంకా తెలియాల్సిఉంది. కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశంఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్‌ దేశానికి రజత పతకాన్ని సాధించిన విశేష ప్రతిభ కనబర్చిన సింధును గౌరవింస్తూ అమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది. అందుకు అంగీకరించిన సింధూను ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియామక పత్రాన్ని అందజేశారు. ఇవాళ మంచి రోజుగా బావించిన సింధూ ఇవాళ విధుల్లో చేరి బాధ్యతలను స్వీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  deputy collector  ap government  gollapudi  vijayawada  badminton  ccla  

Other Articles