Axis Bank revises interest rate on savings account కోతల బాటలో బ్యాంకులు.. కస్టమర్లకు షాకులు..

Axis bank cuts savings rate to 3 5 percent for deposits up to 50 lakh

Axis Bank interest rate cut, Axis bank, interest rate, deposits, BSE, SBI, Bank of Baroda, MCLR, EMIs, retail sector, SMEs, India , Axis Bank cuts savings bank deposits rate to 3.5% on deposits below Rs 50 lakh,news, Axis Bank, savings account, deposits, SBI, Bank of Baroda, India news

Axis Bank lowered the interest rate on savings accounts (SAs) of up to Rs 50 lakh by 50 basis points (bps) to 3.5 per cent. The bank will continue to pay 4 per cent interest on savings accounts with balances of more than Rs 50 lakh.

కోతల బాటలో బ్యాంకులు.. కస్టమర్లకు షాకులు..

Posted: 08/09/2017 10:20 AM IST
Axis bank cuts savings rate to 3 5 percent for deposits up to 50 lakh

ప్రపంచ అత్యంత పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంకు అప్ ఇండియా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు మిగతా బ్యాంకులు కూడా తీసుకునేందుకు కారణమవుతున్నాయి. ఎస్టీఐ కోత మార్గంలో పయనించడాన్ని అన్ని బ్యాంకులు స్వాగతిస్తూ.. అదే మార్గంలో పయనించేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో ఖాతాదారులు షాక్ కు గురై బెండేలెత్తిపోతున్నారు. సేవింగ్స్ అకౌంట్లపై గత కొన్నాళ్లుగా ఖాతాదారులు అందుకుంటున్న వడ్డీరేట్లను తొలుత ఎస్బీఐ తగ్గించగా.. తాజాగా అదే బాటలో అటు జాతీయ, ఇటు ప్రైవేటు బ్యాంకులు కూడా పయనిస్తున్నాయి.

జులై 31న ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు తొలుత పొదుపు ఖాతా వడ్డీ రేట్లను తగ్గించగా తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఎస్బీఐ తరువాత అఘమేఘాల మీద బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ల వడ్డీలపై కొతను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తరువాత కొటక్ మహింద్రా బ్యాంకు కూడా అదే మార్గంలో పయనించినా.. భిన్నమైన విధానాన్ని ప్రకటించింది. లక్ష నుంచి కోటి రూపాయల వరకు చెల్లించే వడ్డీని యధాతథంగా కొనసాగిస్తూనే కోటి నుంచి ఐదు కోట్ల వరకు వున్న అకౌంట్ల వడ్డీని మాత్రం ఆరు నుంచి ఐదున్నర శాతానికి తగ్గించింది.

ఇక తాజగా యాక్సిస్ బ్యాంకు కూడా ఎస్బీఐ బాటలోనే పయనించింది. రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 50 బేస్ పాయింట్ల కోత విధిస్తూ 3.50 శాతం వార్షిక వడ్డీని అందించనున్నట్టు తెలిపింది. రూ.50 లక్షలు, ఆ పైన మొత్తాలు కలిగిన డిపాజిట్లకు మాత్రం 4 శాతం వడ్డీ కొనసాగుతుందని వివరించింది. కాగా, రూ.కోటి కంటే తక్కువ డిపాజిట్ కలిగిన ఖాతాలకు 3.5 శాతం, ఆ పైన డిపాజిట్లకు 4 శాతం వార్షిక వడ్డీ అందించనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ ప్రకటన 90 శాతం మంది ఖాతాదారులపై ప్రభావం చూపనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎస్‌బీఐని అనుసరిస్తూ రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Axis Bank  interest rate cut  savings account  deposits  SBI  Bank of Baroda  business news  

Other Articles