tamil super star rajnikanth to announce new party in a fortnight వచ్చేస్తుననాడహో..! రాజకీయాలపై రజనీ అనధికార క్లారిటీ..

Tamil super star rajnikanth to announce new party in a fortnight

tamilaruvi manian, Rajinikanth, new party, rajinikanth political entry, cn annadurai, k. kamaraj, Gandhiya Arasiyal Iyakkam, fortnight, tamil nadu, politics

Gandhiya Arasiyal Iyakkam party founder president tamilaruvi manian clarifies that tamil super star rajini kanth will announce his party in another 15 days

వచ్చేస్తుననాడహో..! రాజకీయాలపై రజనీ అనధికార క్లారిటీ..

Posted: 08/09/2017 09:43 AM IST
Tamil super star rajnikanth to announce new party in a fortnight

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో రెండు వారల్లో తన కొత్త పార్టీని స్థాపించడం ఖాయమని గాంధీయ మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్ ధీమా వ్యక్తం చేశారు. రజనీకాంత్ ను పోయిస్ గార్గెన్ లోని ఆయన నివాసంలో ఇటీవల రెండు పర్యాయాలు కలిశానని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థిుతులపై సమగ్రంగా చర్చించామని వివరించారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని మణియన్‌ చెప్పారు. తనకు జీవితాన్నిచ్చిన తమిళులకు ఏదైనా మంచి చేయాలన్న తపన అయనలో ప్రగాఢంగా వుందని చెప్పారు.

తనపై ప్రేమాభిమానాలు కనబర్చి తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన తమిళ ప్రజలకు వారి భవిష్యత్తును ఉజ్వలింపజేసేలా మార్పును తీసుకురావాలన్నదే ఆయన అభిమతమని చెప్పుకోచ్చారు. రాజకీయాల్లోకి డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు రజనీ ఎంట్రీ ఇవ్వడం లేదని, ప్రజలకు తనకు చేతనైన మేలు చేయాలన్న ఉద్దేశంతోనేనని చెప్పారు. మరో పక్షం రోజుల్లో రజనీ కచ్చింతగా రాజకీయ పార్టీని ప్రాంభిస్తారని, పార్టీ స్థాపనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశాక... తన సిద్ధాంతాలు, ఆశయాలను వెల్లడించే అవకాశం ఉందని మణియన్‌ పేర్కొన్నారు.

40 ఏళ్ల కిందట చెన్నైకి వచ్చిన తనను తమిళులు ఆదరించారని అయన గుర్తుకు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే భావనతోనే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు ఉందని, రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని తనతో చెప్పారని తెలిపారు. తమిళ ప్రజలందరికీ సేవ చేయలన్నది తన కాంక్షగా చెప్పుకోచ్చిన ఆయన అది రాజకీయాల వల్లే సాధ్యమనే.. రాజకీయాల్లోకి వస్తున్నానని తనతో చెప్పినట్లు తెలిపారు. నిస్వార్థ ప్రజాసేవకు అదర్శంగా నిలిచిన కామరాజర్‌, అన్నాదురైలే తనకు ఆదర్శం అని పదేపదే చెప్పారని, అందువల్ల వారి మార్గంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తారని విశ్వసిస్తున్నానని తమిళరువి మణియన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles