BJP MP from Ajmer Sanwar Lal Jat dies బీజేపి మాజీ కేంద్రమంత్రి కన్నుమూత..

Bjp mp from ajmer sanwar lal jat passes away in delhi

Sanwar Lal Jat, Sanwar Lal Jat no more, BJP MP, former union minister passes away, Union Minister Sanwar Lal Jat, Narendra Modi government, AIIMS, Sanwar Lal Jat in Delhi, india news

Sanwar Lal Jat, a BJP MP and former Union Minister Sanwar Lal Jat, who was being treated at AIIMS in New Delhi, has passed away earlier this morning.

బీజేపి మాజీ కేంద్రమంత్రి సన్వర్ లాల్ కన్నుమూత..

Posted: 08/09/2017 09:18 AM IST
Bjp mp from ajmer sanwar lal jat passes away in delhi

రాజస్తాన్ బీజేపి పార్టీలో విషాదం అలుముకుంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, అజ్మీర్ పార్లమెంటు సభ్యుడు సన్వర్‌లాల్‌ జాట్‌ ఇవాళ తెల్లవారు జామున కన్నుమూశారు. గత పక్షం రోజులుగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌ అసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్  నీటివనరుల సహాయ మంత్రిగా ఆయన గత రెండేళ్లు సేవలందించారు. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గం విస్తరణలో ఆయన పదవిని కొల్పోయారు. ఆ మనోవేధన కూడా ఆయన మరణానికి కారణం అయ్యివుండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన వేదికపైనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌(ఎస్‌ఎంఎస్‌) ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఎన్ని విధాలుగా చికిత్స చేసినా ఆయన అందుకు స్పందించడం లేదని.. ఆయన కోమా నుంచి బయటకు వస్తే కానీ ఆయన పరిస్థితి ఏంటని చెప్పలేమని చెప్పిన అస్పత్రి సూపరింటెండెంట్ మీనా ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి తరలించాలని సూచించడంతో జాట్ కుటుంబసభ్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు.

అక్కడ కూడా గత పక్షం రోజులుగా వైద్యులు అన్ని పరీక్షలు చేస్తున్నా.. ఆయన శరీరం చికిత్సలకు స్పందించలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ తెల్లవారు జామున కన్నుమూశారు.  సన్వర్‌లాల్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సన్వర్‌లాల్‌ 1955, జనవరి 1న అజ్మీర్‌లో జన్మించారు. ఎంకామ్‌, పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. రాజస్థాన్‌ మంత్రిగానూ పనిచేశారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014 నుంచి 2016 వరకు జలవనరుల సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు. రాజస్థాన్‌ కిసాన్‌ ఆయోగ్‌ చైర్మన్‌గానూ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanwar Lal Jat  Ajmer BJP MP  former union minister  Passes away  AIIMS  Delhi  

Other Articles