Strong tremors felt in Xinjiang 6.6-magnitude quake చైనాలో సిచుయాన్ లో భారీ భూకంపం..

6 5 quake hits western china tremors reach kazakhstan

Chengdu, China earthquake, China Earthquake Networks Center, Jiuzhaigou County, Sichuan, china

A 7.0-magnitude earthquake on Tuesday rattled Jiuzhaigou County in China's southwestern Sichuan Province, the China Earthquake Networks Center said.

చైనాలో సిచుయాన్ లో భారీ భూకంపం..

Posted: 08/09/2017 08:36 AM IST
6 5 quake hits western china tremors reach kazakhstan

చైనాలో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ చైనాలో భూమి కంపించడంతో సిచుయాన్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. భూకంపం ధాటికి ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా, వందల మంది భూకంపం బాధితులుగా మారారు. పర్యాటక ప్రాంతమైన సిచుయాన్‌ లో ఈ భూమి కంపించడంతో.. భూప్రకోపానికి 17 మందికి పైగా అసువులు బాయగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది.

భూమి లోపల 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.19 గంటలకు భూమి కంపించిందని ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్‌ జిన్హువా తెలిపింది. భూకంపం తరువాత కూడా ప్రకంపనలు తీవ్రస్థాయిలో వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ప్రాణనష్టం, అస్తినష్టం తీవ్రస్థాయిలోనే సంభవించినట్లు తెలుస్తుంది. కాగా, శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయి.

సుచువాన్‌ ప్రాంతంలో 2008లో కూడా పెను భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై 8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో దాదాపు 70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని భావిస్తారు. అప్పట్లో చంగ్డూ ప్రావిన్స్‌కు సమీపంలో భూమికి 19 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రితం రోజు ఉదయం కూడా ఇక్కడ కొండచరియలు విరిగిపడటంతో 24మంది మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chengdu  China earthquake  China Earthquake Networks Center  Jiuzhaigou County  Sichuan  china  

Other Articles