vichar madya pradesh demands to sack sp meena ఎస్పీ మీనాను భర్తరప్ చేయాలని డిమాండ్

Surya prakash meena sent his son and nephew abroad on farmers quota

Surya Prakash Meena, minister of state for horticulture, Madhya Pradesh, son, nephew, Holland, government expenses, abroad, farmers, minister, news, quota, shivraj singh chouhan, Vichar Madhya Pradesh, Akshya Hunka

The row over Surya Prakash Meena, minister of state for horticulture and food processing in the government of Madhya Pradesh, sending his son and nephew to Holland on government expenses is now gaining a lot of attention.

ఎస్పీ మీనాను భర్తరప్ చేయాలని డిమాండ్

Posted: 08/01/2017 03:53 PM IST
Surya prakash meena sent his son and nephew abroad on farmers quota

భూమిని దుక్కడం రాదు.. దున్నడం అంతకన్నా తెలియదు.. విత్తనాలు చల్లుడు రాదు.. నాట్లు వేయడం అసలే తెలియదు.. కోతలు కోయడం రాదు.. కళ్లెం చేయడం తెలియదు.. కానీ వారంతా రైతులే. ఇది మన భారత దేశ రైతాంగ జాబితా. అవునండీ నిజమే. దేశంలో రైతులకు మాత్రమే చెందాల్సిన ఏ పథకమైనా వుంటే.. పైన చెప్పిన వాటిలో ఏ క్వాలిఫికేషన్ వున్న అందుకు అర్హులు కాదంటే నమ్మండి. ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రభుత్వం గతానికి పూర్తి భిన్నంగా అర్హులైన లబ్దిదారులకు నేరుగా పథకాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్న క్రమంలోనే అదే బీజేపి పాలిత రాష్ట్రంలో జరుగుతున్న తంతు వింటే అవ్వాక్కవక తప్పదు.

మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉద్యానవన, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వున్న సూర్య ప్రకాష్ మీనాను తక్షణం మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని మధ్యప్రదేశ్ రైతు సంఘం విచార్ మధ్యప్రదేశ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మంత్రిగారు చేసిన నిర్వాకం అలస్యంగా వెలుగుచూడటంతో ఆయనపై ఆ రాష్ట్ర రైతాంగం అగ్రహంగా వున్నారు. ముఖ్యమంత్రి ఆయనను తక్షణ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎనమిది నెలల క్రితం మధ్యప్రదేశ్ కు చెందిన 24 మంది రైతులను విదేశాలలోని వ్యవసాయ విధానాలను అద్యయనం చేయడానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిజమైన రైతులు, ఉద్యాన వనాలపై అసక్తి వున్నవారి జాబితాను సిద్దం చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడగా, అందులోంచి కేవలం 24 మందికి మాత్రమే అవకాశాన్ని కల్పించింది సర్కార్జ. అయితే హోల్కాండ్ లోని ఉద్యానవనాల అద్యయనానికి వీరిని పంపింది. కాగా ఈ రైతుల జాబితాలో ఏకంగా మంత్రివర్యుల కుమార రత్నం తో పాటు జామాత కూడా వుండటం గమనార్హం.

ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో మంత్రి సూర్య ప్రకాష్ మీనాను తక్షణం బర్తర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే మంత్రివర్యులు మాత్రం తన కొడుకు, అల్లుడిని వెనకేసుకొస్తున్నారు. వాళ్లు కూడా రైతులని, వ్యవసాయం చేస్తున్నారని, అదే హోదాలో హాల్యాండ్ కు వెళ్లారే తప్ప మరేవిధమైన తప్పిదానికి అస్కారం లేదని చెప్పారు. కాగా విచార్ మధ్యప్రదేశ్ కోఅర్డినేటర్ అక్షయ హుంకా మాత్రం మంతి చర్యలను తీవ్రంగా దుయ్యబట్టి.. రైతులు హక్కుల విషయంలో రాజీపడి తన కొడుకును, అల్లుడిని వెనకేసుకు రావడం హేయకరమని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya Prakash Meena  shivraj singh chouhan  Vichar Madhya Pradesh  Akshya Hunka  son  nephew  Holland  

Other Articles