GHMC plans free breakfast centers in hyderabad హైదరాబాద్ లో ఉచిత అల్పాహార కేంద్రాలు

Ghmc plans free breakfast centers in hyderabad

Free breakfast centers, hyderabad, katedhan, rajendra nagar, free tiffin center, swachh food bank, telangana

greater hyderabad municipal corperation opens swachh food court in rajendra nagar katedhan area which gives free breakfast to needy.

ఆర్తుల అకలిని తీర్చేందుకు స్వచ్ఛా ఫుడ్ కోర్టులు

Posted: 07/29/2017 11:29 AM IST
Ghmc plans free breakfast centers in hyderabad

పేదలు, కిందిస్థాయి మధ్యతరగతి వర్గాల ప్రజల అకలి తీర్చేందుకు సంకల్పించిన ప్రభుత్వం పలు నగరాలకు వలస వెళ్లి జీవనాన్ని సాగిస్తూ.. క్షుద్భాతతో అలమటిస్తున్న వలసజీవుల కడుపులు నింపేందుకు అక్షయపాత్ర ట్రస్టుతో ఒప్పందం చేసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.5 భోజనంతో పేదల ఆకలితీరుస్తుంది. అయితే హైదరాబాద్ నగరంలో అక్షయపాత్ర ట్రస్టుతో ఈ ఒప్పందం చేసుకున్న జీహెచ్ఎంసీ పేదల కడుపు నింపేందుకు మరో అడుగుముందుకేస్తుది. పేదల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

సగం కడుపుతో అలమటించే కడు పేదలు మద్యహ్నం వరకు వేచి చూసి బోజనం చేయడంతో అనారోగ్యానికి గురై నీరసంగా మారుతున్న క్రమంలో ఇక వారికి అల్పాహారం కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనుంది. చిన్న తరహా కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, రిక్షా కార్మికులు ఇలా పేదవర్గాలకు చెందిన వారి కోసం ఉచితంగా అల్పాహారం కూడా అందించాలనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే కంపెనీల సహకారంతో రాజేంద్రనగర్‌లో మొదటి స్వచ్ఛ ఫుడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. దీని అధ్వర్యంలో ఉచితంగా అల్పాహారాన్ని అందిస్తున్నారు.

ఉత్పత్తి క్రమంలో డ్యామేజ్ అయిన అహార పధార్థాలను వృధాగా పారేయడం బదులుగా వాటిని సేకరించి స్వచ్ఛా ఫుడ్ బ్యాంక్ కు అందిస్తున్నారు. ఆ ఫుడ్ బ్యాంక్ ద్వారా అవసరార్ధులకు ఉచితంగా  అల్పాహారం అందిస్తుంది జీహెచ్ఎంసీ. ఈ బిస్కెట్లు, బ్రెడ్‌ను ప్రస్తుతం ఉదయం పారిశుధ్య విధులు నిర్వహించే కార్మికులకూ అందిస్తున్నారు. ఇతర ప్రాంతాలకూ స్వచ్ఛ ఫుడ్ బ్యాంకులను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి పరిశ్రమలు ఉన్న చోట, సమీప ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అంశాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles