సిట్ కు కేసీఆర్ కున్న విజన్ కూడా లేదా? | SIT Has no Vision Like KCR in Drug Case

Varma praised kcr in drug case

RGV KCR, RGV Drug Case, KCR Drug Case, RGV Praise KCR, KCR Great Vision in Drug Case, KCR SIT Visions, RGV KCR Beauty, RGV Shisyas Drug Case, RGV SIT Drug Case

Ram Gopal Varma praises Telangana CM KCR. After KCR Press Meet on Drug Issue RGV Posted in Facebook "KCR has great vision Know the diffeneces between Drug Victim and Users.

కేసీఆర్ కు సర్ ప్రైజ్ విషెస్

Posted: 07/29/2017 11:44 AM IST
Varma praised kcr in drug case

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ వ్యవహారంలో చూపిస్తున్న చొరవకు ముచ్చటేసి ప్రశంసలు కురిపించాడు కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ. రెండు రోజుల క్రితం కేసీఆర్ అండ్ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుందని ఏ నోటితో అయితే తీవ్ర విమర్శలు చేశాడో, ఇప్పుడు అదే నోటితో కితాబిచ్చేశాడు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఈ ఉదయం ఓ సందేశం ఉంచాడు.

కేసీఆర్ నిజంగా ఓ అద్భుతమైన నాయకుడు. డ్రగ్స్ తీసుకుంటున్న వారంతా దోషులు కాదని, కేవలం బాధితులు మాత్రమే అని కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నా. సమస్యను ముఖ్యమంత్రి సరిగా అర్థం చేసుకున్నారు అంటూ కొనియాడాడు. అయితే, విచారణ సిబ్బందికి కూడా కేసీఆర్ విజన్ అవసరమని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అప్పుడే సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందని సూచించాడు.

పంజాబ్ కన్నా తెలంగాణలో డ్రగ్స్ ఇష్యూ దారుణంగా ఉందని, ముంబై ప్రజలు హైదరాబాద్ ను చూసి వణికిపోతున్నారంటూ వర్మ మూడు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు టాలీవుడ్ నే టార్గెట్ చేసి సిట్, అకున్ లపై తీవ్ర పదజాలంతో సందేశాలు ఉంచాడు. దీంతో కేసీఆర్ పై వర్మ వార్ మొదలుపెట్టాడంటూ కొన్ని కథనాలు వచ్చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drug Case  Ram Gopal Varma  Telangana  KCR  

Other Articles

Today on Telugu Wishesh