మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి విషయమై టీడీపీ నేత విసిరిన సవాలును స్వీకరించిన విజయవాడ చేరుకున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులో అప్పుడు కేంద్రంలో వున్న యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని పోందుపర్చినా.. నాలుగేళ్లు కావస్తున్నా ఇంకా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా సాగుతున్నాయన్న విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అరోపించారు.
ఈ నేపథ్యంలో అవినీతి ఎక్కడ జరిగిందన్న విషయమై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండవల్లికి సవాల్ విసిరారు. అరోపణలు చేయడం కాదు వాటిని నిరూపించాలని.. అప్పుడే అరోపణలకు విలువ వుంటుందని.. ఉరికే విమర్శిస్తే సరిపోదని అన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చ సిద్దమా అని సవాల్ విసిరారు. దీంతో సవాలును స్వీకరించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. తాను చర్చకు సిద్దమని ప్రకటించి.. ఇవాళ విజయవాడ వెళ్తుండగా అయనను పోలీసులు అరెస్టు చేశారు. చర్చా వేదికగా పేర్కోన్న ప్రకాశం బ్యారేజీకి కాకుండా పోలీసులు తనను బందరు రోడ్డులోకి తీసుకెళ్తున్నారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more
Aug 11 | అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు... Read more
Aug 11 | విమానంలో ధూమపానం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. పొరపాటున ఊహించనది జరిగితే అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంతే! అలాంటి చోట నియమాలు. భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ, స్పైస్‌జెట్ విమానంలో ఓ ఇన్‌స్టా సెలబ్రిటీ... Read more
Aug 11 | ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుపర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీలపై... Read more
Aug 11 | తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్... Read more