Can't give more time to deposit demonetised notes: Centre రద్దు చేసిన పాత పెద్ద నోట్లు పాతరేనట..

No more chances to exchange demonetized notes centre tells sc

union government, demonetised notes, PM Modi, Arun Jaitley, narendra modi, demonetisation, Supreme Court, Ministry of Finance, J S Khehar, Black Money, reserve bank, urjit patel, shaktikanth das, centre

The Centre informed the Supreme Court that it will not offer any more chances to deposit or exchange demonetized notes to those who missed the December 30 deadline.

రద్దు చేసిన పాత పెద్ద నోట్లు పాతరేనట..

Posted: 07/18/2017 12:45 PM IST
No more chances to exchange demonetized notes centre tells sc

రద్దయిన నోట్ల ఇక పాతరేయడానికి తప్ప మరెందుకు పనికి రావా..? పాత నోట్ల మార్పిడికి ఇక చీటీ చెల్లినట్లేనా..? మరో అవకాశం ఇక లేనట్లేనా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రంకోర్టు పాత నోట్ల డిపాజిట్‌ చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించాలని చేసిన సూచనలను కేంద్రం తోసిపుచ్చింది. చట్టబద్దత కానీ ఈ నోట్లను డిపాజిట్‌ చేసుకునేందుకు ఎలాంటి అవకాశం కల్పించమని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పింది. పాత పెద్ద నోట్లు డిఫాజిట్ కు అవకాశం కల్పిస్తే.. నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యకు విఘాతం కల్గుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

గతేడాది నవంబర్ 8న ప్రధానమంత్రి అకస్మాత్తుగా పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారని, ఆ తరువాత ప్రజలకు కరెన్సీ కోసం పడరాని పాట్లు పడ్డారని, ఇక పాత నోట్లును మార్పిడి చేసుకునేందుకు పెద్ద స్థాయిలో బ్యాంకుల వద్ద క్యూలు వుండటంతో.. అనేక మంది పాత పెద్ద నోట్లను మార్పిడి చేసుకోలేదని, వాటిని తమ వద్దే అట్టిపెట్టుకున్నారని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాజ్యం దాఖలైంది. కేంద్ర సల్పకాలిక గడువులో.. మొత్తం దేశం ప్రజలను కష్టపెట్టిందని పిటీషన్ లో పేర్కోన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది.

సరైన కారణం చెప్పిన వారికి చివరి అవకాశాన్ని కల్పించాలని సూచించిన సుప్రీం.. కేంద్రం నల్లధన నిర్మూలణ చర్యల్లో భాగంగా నిజాయితీ పరులు ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా చెప్పింది. అయితే గతంలో పొడిగించిన గడువులు, పెట్రోల్‌ బంకులు, రైల్వే టిక్కెట్ల బుకింగ్స్‌లో పాత నోట్లకు అనుమతి ఇవ్వడం వంటి వాటిలోనే చాలా దుర్వినియోగాలు తలెత్తాయని, మరోసారి కొత్తగా అవకాశం కల్పిస్తే బినామి లావాదేవీలు పెరిగే అవకాశముందని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. బోగస్‌ కేసుల నుంచి సహేతుకమైన వాటిని గుర్తించడం కూడా కష్టతరమని కేంద్రం పేర్కొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  narendra modi  demonetisation  Supreme Court  Ministry of Finance  centre  

Other Articles